శిశువు ఈ నక్షత్రాల్లో పుడితే మధ్యమ దోషం

Published by: RAMA

4 నక్షత్రాల్లో జన్మిస్తే దోషం, కొన్ని నక్షత్రాల్లో దోషం ఉండదు

మరికొన్ని నక్షత్రాల్లో జన్మిస్తే మధ్యమ దోషం ఉంటుంది..అవేంటంటే

అశ్విని - మొదటి పాదం శిశువుకి, తండ్రికి దోషం - రెండు, మూడు, నాలుగు పాదాలు దోషం లేదు

భరణి - మొదటి, రెండవ, నాల్గవ పాదాల్లో దోషం లేదు.. మూడో పాదంలో జన్మిస్తే తల్లికి, తండ్రికి దోషం

కృత్తిక - మూడో పాదంలో జన్మిస్తే దోషం - తల్లికి, తండ్రికి

రోహిణి – ఒకటి, రెండు, మూడు పాదాలు తల్లికి, తండ్రికి, మేనమామకు దోషం.. నాల్గవపాదం దోషం లేదు

పుష్యమి - రెండు, మూడు పాదాల్లో జన్మిస్తే తల్లికి, తండ్రికి దోషం ఉంటుంది

మఖ – ఒకటి, మూడు పాదాల్లో జన్మిస్తే శిశివుకి, తల్లికి, తండ్రికి దోషం

ఉత్తర మొదటిపాదం, హస్త మూడోపాదంలో జన్మిస్తే దోషం

చిత్త ఒకటి, రెండు, మూడు పాదాల్లో జన్మిస్తే దోషం..నాలుగో పాదం స్వల్ప దోషం

పుర్వాషాఢ మూడోపాదం, పూర్వాభాద్ర నాలుగో పాదం, రేవతి నాలుగో పాదం దోషం