అషురెడ్డి అంటే టీఆర్ఎస్ / బీఆర్ఎస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లు అయ్యింది. ఎందుకంటే... తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్... సారీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా అషురెడ్డి వీడియోలు పోస్ట్ చేశారు. అషురెడ్డి సోషల్ మీడియా చూస్తే... ఓ పార్టీకి మద్దతుగా కొన్ని వీడియోలు ఉన్నాయి. పార్టీ ప్రచారం పక్కనపెట్టి... మధ్యలో ఈ శారీ ఫోటోలు పోస్ట్ చేశారు అషురెడ్డి. గ్రే శారీలో అషు రెడ్డి ఫోటోలు చూసిన కొందరు... దీపావళి సందడి మొదలైందని అంటున్నారు. 'బిగ్ బాస్' షో, రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూలతో అషురెడ్డి బాగా పాపులర్ అయ్యారు. 'బిగ్ బాస్' కంటే ముందు, ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కూడా అషురెడ్డి చేశారు. ఇంకా చేస్తున్నారు. అషురెడ్డి ఫోటోలు (all images courtesy : ashu_uuu / instagram)