Image Source: Apple

భారత దేశంలో అతి పెద్ద స్మార్ట్ ఫోన్ ఎగుమతి దారుగా యాపిల్ నిలిచింది.

Image Source: Apple

2023 మూడో త్రైమాసికంలో అమ్ముడుపోయిన 1.2 కోట్ల ఐఫోన్లలో 49 శాతం మనదేశంలోనే తయారయ్యాయి.

Image Source: Apple

ఈ విషయంలో మొదటిసారిగా శాంసంగ్‌ను యాపిల్ దాటేసింది.

Image Source: Apple

కేవలం ప్రీమియం, సూపర్ ప్రీమియంల్లో మాత్రమే డీల్ చేయడం యాపిల్‌కు ప్లస్ పాయింట్.

Image Source: Apple

యాపిల్‌కు మనదేశంలో ఫాక్స్‌కాన్, విస్ట్రాన్, పెగాట్రాన్ కాంట్రాక్టు తయారీదారులు.

Image Source: Apple

ఐఫోన్ 15 ఉత్పత్తి ఫాక్స్‌కాన్ చెన్నై ప్లాంట్‌లో ఇప్పటికే ప్రారంభం అయింది.

Image Source: Apple

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ తగ్గుతూ ఉండటమే మిగతా బ్రాండ్ల ఎక్స్‌పోర్ట్స్ తగ్గడానికి కారణం.

Image Source: Apple

ఐఫోన్ 15 సిరీస్‌ను యాపిల్ ఇటీవలే లాంచ్ చేసింది.

Image Source: Apple

వీటిలో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్లు ఉన్నాయి.

Image Source: Apple

ఈ సిరీస్ ధర రూ.79,900 నుంచి ప్రారంభం కానుంది.