నాని, నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన 'అంటే సుందరానికీ' ఎలా ఉంది?

కథేంటి?: సుందర్ (నాని) బ్రాహ్మిణ్, లీలా (నజ్రియా) క్రిస్టియన్. వీళ్ళిద్దరూ స్కూల్‌మేట్స్‌. పెద్దయ్యాక ప్రేమలో పడతారు.

సుందర్, లీలా ఫ్యామిలీస్‌లో కాస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి. వీళ్ళ ప్రేమకు పెద్దలు ఎలా ఓకే చెప్పారు. వీళ్ళు ఎలా ఒప్పించారు?

ఎవరెలా చేశారు?: నానికి ఇలాంటి రోల్స్ చేయడం కొట్టిన పిండి. ఈజీగా చేసేశారు. ఆయన టైమింగ్, యాక్టింగ్... రెండూ బావున్నాయి. 

నజ్రియాకు తొలి తెలుగు చిత్రమిది. ఆమె చాలా బాగా నటించారు. నానితో కెమిస్ట్రీ బావుంది. ఆమె కూడా నేచురల్‌గా చేశారు.

నాని, హర్షవర్ధన్ మధ్య సీన్స్ బావున్నాయి. ఇద్దరూ ప్రేక్షకుల్ని నవ్వించారు.

సంగీతం: పాటల కంటే వివేక్ సాగర్ నేపథ్య సంగీతం బావుంది. కథలో భాగంగా పాటలు వచ్చినా ఆకట్టుకునేలా లేవు.

ఎలా ఉంది?: ఫస్టాఫ్ స్లోగా ఉంది. పాత్రలు, నేపథ్యాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఎక్కువ టైమ్ తీసుకున్నారు.

సెకండాఫ్‌లో సినిమా పట్టాలు ఎక్కింది. వేగంగా ముందుకు వెళ్ళింది. వినోదాత్మక సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

సినిమాకు కామెడీ బలం. నిడివి బలహీనత. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో సీన్స్ ట్రిమ్ చేస్తే బావుండేది.

చివరగా: కథ కొత్తగా లేదు. కానీ, కామెడీ బావుంది. కాసేపు హాయిగా నవ్వుకోవచ్చు. ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా వెళ్ళండి.