టాలీవుడ్ లో మన్మథుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు నాగార్జున. 62 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆయన ఆగస్టు 29న ఇప్పుడు 63వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన లగ్జరీ లైఫ్‌స్టైల్ గురించి తెలుసుకుందాం. అందుతున్న సమాచారం ప్రకారం.. నాగార్జున ఆస్తుల విలువ 3 వేల కోట్లకు పైగానే అంటున్నారు. ఆయన హైదరాబాద్ లో ఉండే ఇంటి ఖరీదు యాభై కోట్లకు పైగా ఉంటుందట. నాగార్జునకు సొంత ప్రొడక్షన్ హౌస్ ఉంది. అదే అన్నపూర్ణ స్టూడియోస్. దీని విలువే వందల కోట్లు ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. హైదరాబాద్ లో లగ్జరీ హోటల్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు ఆయన ఆయన దగ్గర లగ్జరీ కార్లు ఉన్నాయి BMW 7 సిరీస్ కి చెందిన కారు కోటికి పైగానే ఉంటుంది. అలానే Audi A-7 కారు కూడా నాగ్ దగ్గర ఉంది.