వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ ఇక్కడ పెడితే డబ్బుకి లోటుండదు
మనీ ప్లాంట్ అదృష్టం, సంపద, శ్రేయస్సుతో పాటు సానుకూల శక్తిని ఆకర్షిస్తుందని చెబుతారు. అయితే ఈ ప్లాంట్ ను ఉంచాల్సిన ప్రదేశంలో ఉంచితే సంపద కలిసొస్తుందంటారు వాస్తు పండితులు.
మనీ ప్లాంట్ హాల్ లో పెట్టాలనుకుంటే.. గది యొక్క ఆగ్నేయ మూలలో ఉంటే అదృష్టం వరిస్తుంది. ఈ దిశను శుక్రుడు, గణేశుడు పాలించినందున ఈ రెండూ సంపదకు, అదృష్టానికి ప్రతీక. మీ జీవితంలో సానుకూల మార్పులొస్తాయి.
బెడ్ రూమ్ లో మనీ ప్లాంట్ పెట్టాలనుకుంటే మంచానికి ఎడమ, కుడి వైపు పెట్టొచ్చు కానీ కాళ్లు, తల అటువైపు పెట్టకూడదు.
మనీప్లాంట్ ను ఉత్తరం వైపు, తూర్పు గోడకు, ఈశాన్యం మూలన అస్సలు పెట్టకూడదు. ఇలా చేస్తే వాస్తు ప్రకారం డబ్బు కోల్పోతారు,అనారోగ్య సమస్యలు వస్తాయి
బాత్‌రూమ్ వంటి తేమతో కూడిన మూలల్లో మనీప్లాంట్ సులభంగా పెరుగుతుంది. పైగా బాత్రూంలో ఉంచడం వల్ల వాస్తు పరంగా ఎలాంటి హాని జరగదు
మనీ ప్లాంట్లు రేడియేషన్లను గ్రహించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. అందుకే టీవీ, కంప్యూటర్, వై-ఫై రోటర్ల దగ్గర ఉంచొచ్చు.
వాస్తు ప్రకారం, మనీ ప్లాంట్‌ను ఎప్పుడూ ఇంటి లోపల ఉంచాలి కానీ తోట ప్రాంతంలో ఉంచకూడదు
ఇది సహజమైన ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా.
ఆరోగ్యాన్నిచ్చే మనీ ప్లాంట్ వాస్తు ప్రకారం ఉండాల్సిన ప్లేస్ లో ఉంచితే అంతా మంచే జరుగుతుంది.
వాస్తు నిపుణులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల్లో ప్రస్తావించిన విషయాల ఆధారంగా రాసిన వివరాలివి. వీటిని ఎంతవరకూ విశ్వశించాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం