దోమ కాటు దురద కలిగించినప్పుడు చిరాకుగా ఉంటుంది. మీ వంటగదిలోని వస్తువులతోనే ఉపశమనం పొందవచ్చు. వాము:- దోమ కాటు వేసిన చోట ఆకులు మెత్తగా చేసి పూయండి. వాము ఆకులనీరు కూడా వాడొచ్చు. ఉల్లిపాయ:- ఉల్లి రసాన్ని దోమ కాటు వేసిన చోట రాయండి. తర్వాత ఆ ప్రాంతాన్ని బాగా కడగాలి. వెనిగర్:- దోమ కాటు వేసిన చోట వెనిగర్ పూయండి మంట తగ్గిస్తుంది. వేడి నీటిలో కలిపి స్నానం చేయొచ్చు. తులసి:- నీరు, తులసి ఆకుల పేస్ట్ దోమ కాటు వేసిన చోట రుద్దండి. తులసి ఆకులను మెత్తగా చేసి రుద్దొచ్చు. వంట సోడా:- స్పూన్ బేకింగ్ సోడా, నీటితో కలిపి పేస్ట్ తయారు చేసి వాడండి. 10 నిమిషాల తర్వాత కడిగేయండి కలబంద:- కలబంద(అలువేరా)జెల్ కాలిన గాయాలతోపాటు దోమ కాటు నుంచి ఉపశమనం కల్పిస్తుంది. వేడి చేయాలి:- వెచ్చగా ఉండేలా గుడ్డను వేడి నీటిలో నానపెట్టి దురద పెట్టే చోట పెట్టాలి. ఇలా 10 నిమిషాలు చేస్తే చాలు.. మంచుగడ్డ:- మంచు గడ్డను గుడ్డలో పెట్టి వాపుపై పెడితే నొప్పి లేకుండా చూస్తుంది. ఓట్‌మీల్:- ఓట్‌మీల్‌తో పేస్ట్ తయారు చేసి పది నిమిషాలు దోమ కుట్టిన చోట రాయాలి. ఆపేస్ట్‌తో స్నానం చేయొచ్చు వెల్లుల్లి:- వెల్లుల్లిని కోసి, లోషన్ లేదా పెట్రోలియం జెల్లీతో క్రీమ్‌ల చేసి దోమ కరిచిన చోట పూయండి.