ఓలా కొత్త ఎస్1 స్కూటర్ మనదేశంలో ఇటీవలే లాంచ్ అయింది. గతేడాది లాంచ్ అయిన ఎస్1 ప్రో టెక్నాలజీతోనే దీన్ని కూడా రూపొందించారు. ఈ కొత్త స్కూటీ 131 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. టాప్ స్పీడ్ గంటకు 95 కిలోమీటర్లు. ప్రారంభ ఆఫర్ కింద ప్రస్తుతానికి దీని ధరను రూ.99,999గా (ఎక్స్-షోరూం) నిర్ణయించారు. రూ.500 చెల్లించి ఈ స్కూటీని బుక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి దీని డెలివరీలు ప్రారంభం కానున్నాయి. రెడ్, జెట్ బ్లాక్, పోర్స్‌లెయిన్ వైట్, నియో మింట్, లిక్విడ్ సిల్వర్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్‌లో ఆపరేటింగ్ సిస్టంను కూడా అందించారు. మూవ్ఓఎస్ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై స్కూటీపై ఫోన్ పనిచేయనుంది. ఓలా ఎస్1 ప్రో తరహాలో మ్యూజిక్ ప్లేబ్యాక్ ఫంక్షనాలిటీ ఇందులో కూడా ఉంది. సపోర్ట్ చేసే యాప్ ద్వారా చార్జ్ స్టేటస్, ఓడో మీటర్ రీడింగ్ వంటి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ కారు 2024లో మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.