జియో 5జీ సర్వీసులు అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్నట్లు ముకేష్ అంబానీ ప్రకటించారు.

ధన్‌తెరాస్ (అక్టోబర్ 22) నుంచి ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

మొదటగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో జియో 5జీ అందుబాటులోకి రానుంది.

దేశంలోని అన్ని ప్రాంతాలకు 2023 డిసెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు.

జియో 5జీ ప్లాన్లను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

అలాగే జియో 5జీ ఫోన్ ఎప్పుడు లాంచ్ కానుందో కూడా కంపెనీ ప్రకటించలేదు.

అత్యంత చవకైన 5జీ ఫోన్ కోసం గూగుల్‌తో భాగస్వామ్యం ఏర్పర్చుకున్నట్లు ప్రకటించింది.

దీన్ని బట్టి రూ.10 వేలలోపే జియో 5జీ ఫోన్ ధర ఉండనుంది.

మేడ్ ఇన్ ఇండియా 5జీ సేవలను అందించాలని జియో నిర్ణయించింది.

దీని కోసం మైక్రోసాఫ్ట్, క్వాల్‌కాంలతో ఒప్పందం కుదుర్చుకుంది.