Importance of Workout: వ్యాయామ అవసరాలను చెబుతున్న 50+ ఏళ్ల దంపతులు | ABP Desam
కరీంగర్ జిల్లా తీగల గుట్టపల్లికి చెందిన రవీందర్, లక్ష్మి దంపతులు.... ఫిట్ నెస్ ఫ్రీక్స్ కి ఓ ఉదాహరణలా కనిపిస్తున్నారు. అనేక అనారోగ్య సమస్యలు తలెత్తటంతో వ్యాయామం మొదలుపెట్టిన వీరు... అనేక అవార్డులు దక్కించుకున్నారు. వాకింగ్, జాగింగ్ తో మొదలుపెట్టిన రవీందర్... 56 ఏళ్ల వయసులోనూ 10K రన్ చేయగలుగుతున్నారు. భర్త స్ఫూర్తితో రవీందర్ భార్య లక్ష్మి... 2013లో 9 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు 5 కిలోమీటర్లు పరిగెత్తి రికార్డు సృష్టించింది. మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకే ఇలా చేశానన్నారు. రవీందర్ ఇప్పుడు వండర్ రికార్డు కోసం మరో ప్రయత్నం చేశారు. 30 నిమిషాల పాటు మైనస్ డిగ్రీల నీటిలో ఉండి.... సరికొత్త ప్రదర్శన చేశారు.