భార్య అలక తీర్చేందుకు ఈ మాత్రం ఖర్చు చేయక తప్పదు మరి..
అమ్మాయిల అలక తీర్చేందుకు అబ్బాయిలు నానా కష్టాలు పడతారు. కొందరు లాంగ్ రైడ్‌లకు తీసుకెళ్లి కూల్ చేస్తే మరికొందరు, వాళ్లకు ఇష్టమైన వస్తువులు కొనిచ్చి ఐస్ చేస్తారు. పారిస్‌లో ఓ వ్యక్తికి పాపం ఇలాంటి కష్టమే ఎదురైంది. కొత్తగా పెళ్లైన జంట పారిస్‌కి హనీమూన్‌కి వెళ్లింది.రాత్రి డిన్నర్ చేశాక ఇద్దరూ హోటల్‌లో లాబీకి వచ్చి కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే మియా ఖలీఫా అక్కడికి వచ్చింది.ఆమెను చూడగానే అబ్బాయి వెంటనే గుర్తు పట్టేశాడట. అలాగే కాసేపు చూశాడట. ఇక అంతే. వెంటనే అమ్మాయి అలకపాన్పు ఎక్కింది. "నేను పక్కన ఉండగా ఆమెను ఎందుకు చూస్తున్నావ్" అని జెలసీగా ఫీల్ అయిందట.
ఏం చేయాలో అర్థం కాక, భార్యను కూల్ చేసే పనిలో పడ్డాడు ఆ భర్త. వెంటనే ఓ ఐడియా వచ్చింది. ఆ అమ్మాయికి ఎంతో ఇష్టమైన బిర్కిన్‌కంపెనీ హ్యాండ్‌బ్యాగ్ కొనిచ్చి ఐస్ చేసేశాడు. ఆ బ్యాగ్ విలువెంతో తెలుసా..? రూ. 7 లక్షల పైమాటే. ఆ బ్రాండ్ వాల్యూ అలాంటిది మరి. అంత కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చాక అమ్మాయి కరిగిపోకుండా ఉంటుందా..? వెంటనే గొడవంతా మర్చిపోయింది. ఇదంతా వీడియో తీసి తన టిక్‌టాక్ అకౌంట్‌లో షేర్ చేసింది మియా ఖలీఫా. ఇంకేముంది, ఈ వీడియో ఒక్కసారిగా వైరల్ అయింది. "నేను డిన్నర్ చేసి వస్తుంటే ఆ అబ్బాయి నన్నుచూశాడు. అది అతని భార్యకు కోపం తెప్పించిందట. ఆ కోపం తగ్గించేందుకు బిర్కిన్ హ్యాండ్ బ్యాగ్ కొనిచ్చాడు" అంటూ మియా ఖలీఫా ట్వీట్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. "నీ భార్య ఓ బ్యాగ్‌తో కూల్ అయింది, నా భార్యకైతే ఓ స్టోర్ అంతా కొనిచ్చినా సరిపోదు బాబోయ్" అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.