Maths Behind Sandwiches Cutting: మ‌న‌కు తెలియ‌కుండానే మ‌న‌చుట్టూ ఉన్న ప్ర‌పంచంలో గ‌ణితం, సైన్స్, టెక్నాల‌జీ దాగి ఉంటాయి. మ‌న పూర్వీకులు చెప్పిన ప్ర‌తి అంశంలోనూ వీటిలో ఏదో ఒక త‌ర్కం దాగి ఉంటుంది. వేల సంవ‌త్స‌రాల క్రిత‌మే మ‌న పూర్వీకులు ఇప్ప‌టికీ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌కు కూడా అంద‌ని ప‌రిజ్ఞానంతో అబ్బుర‌ప‌రిచే భారీ నిర్మాణాలు చేప‌ట్టారు. కొన్ని కొన్ని ఆల‌యాల్లోకి వెళితే వారి నైపుణ్యం క‌నిపిస్తుంది. మాన‌వ మేధ‌కు అంద‌ని ఎంతో మేథ వాటిలో దాగుంటుంది...


మ‌నం తినే శాండ్‌విచ్‌లో కూడా క‌నిపించని గ‌ణితం ఉందని తెలుసా.. మీరెప్పుడైనా శాండ్‌విచ్ తిన్నారా.. శాండ్ విచ్ ఎందుకు త్రిభుజాకారంలో ఉంద‌ని ఆలోచించారా.. చ‌తుర‌స్త్రాకాంలో ఉండే బ్రెడ్ పీస్ ని స‌గానికి దీర్ఘ‌చ‌తుర‌స్త్రాకారంలో కాకుండా త్రిభుజాకారంలోనే ఎందుకు క‌ట్ చేస్తారో తెలుసా.. స‌రే.. ఒక ప‌ని చేయండి. మీద‌గ్గరున్న బ్రెడ్ పీస్‌ని ఒక‌దాన్ని స‌గానికి దీర్ఘ‌చ‌తుర‌స్త్రాకారంలో, మరొకదాన్ని త్రిభుజాకారంలో క‌ట్ చేయండి. రెండింటినీ ప‌క్క‌ప‌క్క‌న ఉంచి ప‌రిశీలించి చూడండి.


Also Read: రోడ్ సైడ్ చాయ్ వాలా - స్టైలింగ్‌తోనే సూపర్ స్టార్ అయ్యాడు - ఇప్పుడెంత సంపాదిస్తాడో తెలుసా ?


త్రిభుజాకారంలో ఉన్న బ్రెడ్ పెద్ద‌గా అనిపించిందా... అలా అనిపించ‌డానికే దాన్ని త్రిభుజా కారంలో స‌గానికి క‌ట్ చేసి శాండ్ విచ్ త‌యారు చేస్తారు. అంతేత‌ప్ప ఏ ఆకారంలో క‌ట్ చేసినా చేసే విధానంలో తేడా ఉండ‌దు.. తింటే టేస్ట్ కూడా ఏ మాత్రం తేడా ఉండ‌దు. ఇందుకు సంబంధించిన వీడియోలు చాలా ఆన్‌లైన్‌లో కనిపిస్తాయి. వాటిని ఒక‌సారి చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంది. చూస్తే మీరు కూడా వావ్ అన‌కుండా ఉండ‌రు.


త్రిభుజాకారంలో క‌ట్ చేసిన బ్రెడ్ పీస్ దీర్ఘ‌చ‌తుర‌స్త్రాకారంలో ఉన్న‌దాని క‌న్నా 4 సెంటీమీట‌ర్ల చుట్టుకొల‌త ఎక్కువ‌గా ఉంటుంది. 4 సెంటీమీట‌ర్ల బ్రెడ్డు ముక్క చాలా చిన్న‌దే అయినా, చూడ్డానికి మాత్రం త్రిభుజాకారంలో ఉంటే పెద్ద‌దిగా క‌నిపిస్తుంది. ఇదే బిజినెస్ ట్రిక్కు. దీన్ని వివరిస్తూ ఇన్‌స్టా గ్రాంలో వీడియోలు చాలానే పోస్ట్ చేశారు.


Also Read: 'ఊడ్చే' ఉద్యోగాలకు భారీగా దరఖాస్తులు, ఏకంగా 46 వేలమంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు పోటీ