viral video: బికినీలు ధరించి ప్రయాణం, ప్రేమికుల ముద్దులు, గొడవలకు కేరాఫ్‌గా మారిన ఢిల్లీ మెట్రో మరోసారి వార్తల్లో నిలిచింది. తరచూ విన్యాసాలు, అసభ్యకరమైన ప్రవర్తనతో ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నందుకు గాను ఢిల్లీ మెట్రో అధికారులు వీడియోలకు నిషేధం విధించినా పలు అభ్యంతకర వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా ఇద్దరు యువతులు ఢిల్లీ మెట్రోలో పోల్ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


పోల్ డ్యాన్స్‌తో రచ్చరచ్చ...


 






పర్వీన్ బాబీ, శశి కపూర్‌లు నటించిన ‘సుహాగ్’ చిత్రంలోని ‘మెయిన్ టు బేఘర్ హూన్’ పాటకు ఇద్దరు యువతులు స్టెప్పులు వేశారు. ఈ వీడియోలో ఒక మహిళ కూర్చొని స్తంభానికి వేలాడుతూ ఉండగా, మరొకరు ఆమె చుట్టూ తిరిగారు. ఈ విధంగా పోల్ డ్యాన్స్ లు చేస్తూ ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారు. ఈ వీడియో గురువారం ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేయగా వైరల్ గా మారింది. ఈ  వీడియో వైరల్ అవుతుండటంతో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ‘ మొన్న లవర్స్ పోర్న్, నిన్న ముద్దులాటలు, నేడు పోల్ డాన్స్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అధికారులు కఠిన ఆంక్షలు విధిస్తున్నా మెట్రోలో తరచూ వెలుగుచూస్తున్న విన్యాసాలపై ప్రయాణికులు, నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.