మాటు వేసి..వేటాడిన చిరుత
డిస్కవరీ ఛానల్‌లో సింహాలు, పులులు వేటాడే సీన్లు వస్తుంటే అలానే నోళ్లు వెళ్లబెట్టి చాలా ఆసక్తిగా చూస్తుంటాం. ఒక్కసారి వాటి నోటికి ఏదైనా చిక్కగానే "అబ్బ, ఏం పట్టేసింది" అని ఎగ్జైట్ అయిపోతాం. వేటాడే విజువల్స్ అంటే అందరికీ ఇంట్రెస్టే మరి. డిస్కవరీ ఛానల్స్‌లోనే కాదు. ఒక్కోసారి బయట కూడా ఇలాంటి మన కళ్లెదురే కనిపిస్తుంటాయి. జస్ట్ ఆ టైమ్‌కి వీడియో క్యాప్చర్ చేయాలనే ఆలోచన వస్తే చాలు. ఆ వీడియో అప్‌లోడ్ చేస్తే ఇంటర్నెట్ షేక్ అయిపోతుంది. ఇప్పుడు అదే జరిగింది. ఓ చిరుత పిల్లకోతిని వేటాడిన తీరుని చూసి నెటిజన్లు షాక్అవుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్‌లో జరిగింది ఈ అరుదైన ఘటన. పన్నా టైగర్ రిజర్వ్ ట్విటర్‌లో ఈ వీడియో పోస్ట్ చేశారు.
అరుదైన దృశ్యం..నెటిజన్ల రియాక్షన్లు
చాలా చాకచక్యంగా కోతి పిల్లను పట్టుకుంది చిరుత. ఓ చెట్టు మీద కూర్చుని మరో చెట్టుపై ఉన్న కోతి పిల్లను గమనిస్తూ కూర్చుంది. పట్టు దొరుకుతుంది అనే సమయానికి ఒక్కసారిగా ఎగిరి పక్క చెట్టుపై ఉన్న కోతి పిల్లను పంటితో కరుచుకుంది. అంతే వేగంతో కింద పడిపోయినా ఎక్కడా పట్టు తప్పకుండా చాలా జాగ్రత్తగా ల్యాండ్ అయింది చిరుత. నోట్లో కోతి పిల్లనూ విడిచి పెట్టలేదు. కింద పడగానే ప్రశాంతంగా కూర్చుని అటు ఇటు చూస్తూ ఏమీ తెలియనట్టుగా ఉండిపోయింది. ఈ విజువల్ చూసి నెటిజన్లు అందరూ వావ్ అంటున్నారు. "ఎంతో అరుదైన దృశ్యం. చిరుత కోతి పిల్లను వెంటాడుతోంది" అని అంటూ పన్నాజీ టైగర్ రిజర్వ్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. జూన్ 28న ఈ వీడియోను పోస్ట్ చేయగా రియాక్షన్స్ వెల్లువెత్తుతున్నాయి. పన్నాజీ టైగర్ రిజర్వ్‌లో ఎన్నో అరుదైన జంతువులు కనిపిస్తాయి. చిరుతలతో పాటు పాంగోలిన్స్, ఇండియన్ ఫాక్సెస్‌నూ ఇక్కడ చూడొచ్చు. వీటితో పాటు దాదాపు 200 రకాల అరుదైన పక్షులూ ఉంటాయి.
Also Read: Samantha On Unhappy Marriage: సంసార జీవితాల్లో సంతోషం లేకపోవడానికి నువ్వే కారణం కరణ్ - సమంత