Pune BMW Video | పూణే: లగ్జరీగా బతకడం అంటే ఖరీదైన కార్లలో తిరుగుతూ, మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పిచ్చి పనులు చేయడం కాదు. కానీ పూణేలో ఓ యువకుడు బీఎండబ్ల్యూ కారు దిగి రోడ్డు పక్కన చేసిన పనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. దాంతో పోలీసులు సెర్చ్ చేసి మరి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడితో పాటు కారులో ఉన్న మరో యువకుడిపై సైతం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.


సిగ్నల్ వద్ద ఆగిన కారు..


ఓ యువకుడు పుణేలోని ఎరవాడలోని శాస్త్రినగర్ ప్రాంతంలో సిగ్నల్ వద్ద రోడ్డు మధ్యలో బీఎండబ్ల్యూ లగ్జరీ కారు ఆగింది. డ్రైవర్ ఎందుకు దిగాడని కాదు, రోడ్డు మధ్యలోనే కారు నిలపడంతో అనుమానం వచ్చి వేరే వ్యక్తి కెమెరాలో రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. బీఎండబ్ల్యూ దిగిన యువకుడు రోడ్డు పక్కనే టాయిలెట్ పోశాడు. ఏ భయం, బెరుకు లేకుండా మూత్ర విసర్జన చేశాడు. కారులో లోపల ఉన్న యువకుడి చేతిలో బీర్ బాటిల్ ఉంది. దాంతో వీరు మద్యం మత్తులో ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 


సోషల్ మీడియాలో వీడియో వైరల్


యువకుడు రోడ్డు పక్కనే ఏ భయం లేకుండా మూత్ర విసర్జన చేస్తుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. ఎవరో వీడియో తీస్తున్నారని భయం సైతం లేకుండా చేసిన పనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. మద్యం మత్తులో వేరే వారి ప్రాణాలు తీసే అవకాశం ఉందని, పోలీసులు అతడి డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేశారు. హీరోయిజం అనుకుంటూ పిచ్చి పనులు చేస్తే చర్యలు తప్పవని పోలీసులు ఆ వైరల్ వీడియోపై స్పందించారు.






బీఎండబ్ల్యూ నడిపింది గౌరవ్ అహుజా కాగా, అతనితో పాటు స్నేహితుడు భాగ్యేష్ ఓస్వాల్‌ ఉన్నాడని పోలీసులు గుర్తించారు. వీడియో వైరల్ కావడంతో గౌరవ్ అహుజా పరారయ్యాడు. కానీ పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాలు జల్లెడ పట్టి సతారా జిల్లాలో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. పబ్లిక్ న్యూసెన్స్ తో పాటు బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, మోటారు వాహనాల చట్టం కింద కేసు నమోదు చేశారని పీటీఐ రిపోర్ట్ చేసింది. 


కారులో అతడితో పాటు ఉన్న ఓస్వాల్ ను మొదట అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి సతారాలోని కరాడ్ తహసీల్ లో నిందితుడు అహుజాను అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో ఆ పని చేశారని వైద్య పరీక్షలకు పంపారు. వీడియో వైరల్ కావడంతో.. తాను తప్పు చేశానని అహుజా అంగీకరించాడు. ప్లీజ్.. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. కొన్ని గంటల్లో లొంగిపోతానని నిందితుడు అహుజా ఆ వీడియోలో రిక్వెస్ట్ చేశాడు. 


Also Read: Viral News: కోనసీమలో మోనాలిసా అంటూ బాలిక వీడియో తీశాడు.. చివరకు ఆ యువకుడి పరిస్థితి ఇదీ