Eagle : సృష్టిలో చాలా జంతువులు, పక్షులు ఉంటాయి. ఒక్కో ప్రాణికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అందులో చాలా విషయాలు మనం నమ్మలేనివిగా, వినడానికే ఆశ్చర్యంగా అనిపిస్తాయి. శాస్త్రవేత్తలు ఇప్పటివరకు అనేక జంతువులు, పక్షులు, వాటి జాతులను కనుగొన్నారు. అయినప్పటికీ ఇంకా ఈ భూమిపే ఎన్నో జంతువులు, పక్షులు ఉంటాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే సాధారణ జంతువులు, మనుషుల కంటే చాలా రెట్లు ఎక్కువ దూరం చూడగలిగే పక్షి ఒకటి ఉందని మీకు తెలుసా. అవును. ఆ పక్షి మరేదో కాదు డేగ(Eagle). 


మెదడు కంటే పెద్ద కళ్లు


మీరు సినిమాల్లోనూ లేదా నిజ జీవితంలోనూ డేగ కన్ను గురించి అనేక వింతైన, ఆశ్చర్యకరమైన విషయాలను విని ఉంటారు. అందులో ముఖ్యంగా చెప్పుకునేది డేగ కన్ను గురించి. వాటి కళ్లు పదునుగా, చురుకుగా పని చేస్తాయి. డేగ బరువు ఒక కిలో కంటే తక్కువే. దాని కళ్ళు కూడా చిన్నవే. కానీ అది చాలా రెట్లు బాగా చూడగలదు. ఇక డేగ కన్ను ఆకారం విషయానికొస్తే.. ఇది మానవుడి కన్నులానే ఉన్నప్పటికీ, వెనుక భాగం మాత్రం కాస్త చదునుగా ఉంటుంది. బరువు విషయానికొస్తే.. వాటి కళ్ళు వాటి మెదడు కంటే పెద్దవిగా ఉంటాయట. అందుకే చాలా మంది ప్రపంచంలోనే మంచి కెమెరాల విజువలైషన్ ను డేగ కన్నుగా పరిగణిస్తారంటేనే అర్థం చేసుకోవచ్చు వాటి కళ్ల శక్తిని. 


మనిషి కళ్లు


భూమిపై చాలా దూరంలో ఉన్న వస్తువులను మానవులు కళ్ళు చాలా స్పష్టంగా చూడగలవు. ఇది మాత్రమే కాదు, మానవ కన్ను కూడా చాలా రంగులను గుర్తించగలదు. కానీ జంతువుల విషయంలో ఇది జరగదు. సాధారణంగా ప్రపంచంలోని అన్ని జీవులకు కళ్ళు ఉంటాయి. కొన్ని జంతువులు మానవుల వలె స్పష్టంగా చూస్తాయి. కొన్ని వస్తువులను రంగుల రూపంలో చూస్తాయి. కంటి పరిమాణం ఆప్టికల్ రిజల్యూషన్‌ను నిర్ణయిస్తుంది. పెద్ద కళ్ళు, అధిక రిజల్యూషన్ ను ప్రదర్శిస్తుంది. అయితే, దీనికి మినహాయింపులు కూడా ఉన్నాయి.


డేగ కన్ను


చాలా మంది పదునైన కళ్ళు ఉన్నవారిని "ఈగిల్-ఐడ్" అని పిలవడం వింటూనే ఉంటాం. అయితే ఇవి ఐదు వేర్వేరు రంగుల ఉడుతలను గుర్తించగలవు. అవి కొన్ని కి.మీ. దూరంలో ఉన్నా సరే తమ ఎరను గుర్తించగలవు. డేగలే కాకుండా గుడ్లగూబలు వంటి పక్షులను కూడా రాప్టర్స్ అని పిలుస్తారు. ఇవి అసాధారణ దృష్టిని కలిగి ఉంటాయి. అవి కూడా తమ ఎరను సులభంగా గుర్తించి వేటాడగలుగుతాయి. ఈ రాప్టర్లను "ఎర పక్షులు" అని కూడా పిలుస్తారు.



డేగల జీవితకాలం


అడవిలో బతికే డేగలు 30 ఏళ్లు బతుకుతాయి. ప్రత్యేకంగా పెంచే డేగలు 50 ఏళ్ల వరకు బతుకుతాయి. కొన్ని రకాల డేగలు 31 సంవత్సరాల 8 నెలలపాటు బతుకుతాయి. వన్యప్రాణుల జీవశాస్త్రవేత్త టాడ్ కాట్జ్నర్ 25 సంవత్సరాలు డేగలను అధ్యయనం చేసి ‘ది ఈగిల్ వాచర్స్’ అనే పుస్తకాన్ని రాశారు. గద్ద ముక్కు పెరిగిపోతే అది రాళ్లకేసి కొట్టుకుని, ముక్కు విరగగొట్టుకుంటుందని, కొంతకాలానికి తిరిగి డేగ ముక్కు పెరిగుతుందని అనుకుంటారు. నిజానికి.. డేగ మాత్రమేకాదు ఏ పక్షికైనా చిన్నగాయం తగిలితే కొంతకాలానికి అది నయం అవుతుంది. అదే ముక్కు విరగడం వంటివి జరిగితే అవి బతికినంత కాలం అంగవైకల్యంతోనే బతుకుతాయి తప్ప తిరిగి పెరిగే అవకాశం ఉండదని టాడ్ కాట్జ్నర్ తన బుక్‌లో పేర్కొన్నారు.


Also Read : Viral Video: జగన్నాథుని విగ్రహం ముందు శిరస్సు వంచిన కోడి - వైరల్ వీడియో