Hen Bows Down Infront Of Jagannath Idol: మనుషులతో పాటు జంతువులు, పక్షులు సైతం దేవునిపై తమ భక్తిని చాటుకుంటాయి. శివాలయంలో శివలింగం చుట్టూ పాము పడగ విప్పడం, విఘ్నేశ్వరుని ఆలయంలో ఏనుగు మోకరిల్లడం వంటి ఘటనలు మనం చూశాం. తాజాగా, ఓ కోడి జగన్నాథుని విగ్రహం ముందు శిరస్సు వంచి మొక్కింది. ఈ వింత ఘటన ఒడిశాలో (Odisha) జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తాజాగా వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని పూరీలో కొలువైన జగన్నాథుడిని ఆ రాష్ట్ర ప్రజలే కాక దేశం నలుమూలల నుంచి భక్తులు దర్శించుకుంటారు. అలాంటి ఒడిశాలో ఒకచోట ఎత్తైన పీటపై జగన్నాథ స్వామి విగ్రహం ఉండగా.. ఓ కోడి అక్కడకు వచ్చి జగన్నాథుని ముందు వంగి ప్రార్థించింది. ఈ వీడియో క్లిప్‌ను 'జగన్నాథ్ ధామ్ పూరి ఎక్స్‌పర్ట్' ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇది వైరల్ కాగా.. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. నారాయణుడు అందరిలోనూ ఉంటాడని కొందరు.. విశ్వమంతా ఆయన ముందు తలవంచాలి అని మరికొందరు కామెంట్స్ చేశారు.






Also Read: Beggars: ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు