Viral video | యువకుడు ప్లాట్‌ఫాం మీద నిలుచుని ఉన్నాడు. కాసేపు అటూ ఇటూ చూశాడు. రైలు ప్లాట్‌ఫారమ్‌ మీదకు వస్తుందని తెలియగానే.. పట్టాల మీదకు దూకేశాడు. అప్పుడే.. దైవం పంపిన దూతలా ఓ పోలీస్ ఎంట్రీ ఇచ్చాడు. వేగంగా దూసుకొస్తున్న రైలును సైతం లెక్క చేయకుండా ఆ యువకుడి మీదకు దూకి ప్రాణాలు రక్షించాడు. ఈ ఘటన బుధవారం మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 


థానే జిల్లాలోని విఠల్‌వాడి రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారమ్‌ మీదకు వస్తున్న రైలు ముందుకు దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అదే సమయంలో అక్కడే ఉన్న ప్రభుత్వ రైల్వే పోలీసు (GRP) కానిస్టేబుల్ అధికారి హృషికేష్ మానే(35) ట్రాక్‌పైకి దూకి అతడి ప్రాణాలు రక్షించాడు. ఆ సమయానికి అతడు ఏదో పని మీద అక్కడికి వచ్చాడు. యువకుడు ట్రాక్ మీదకు దూకగానే.. అక్కడే ఉన్న ప్రయాణికుల అరుపులు విని.. వెనక్కి తిరిగి చూశాడు. క్షణం ఆలస్యం చేయకుండా తాను కూడా పట్టాల మీదకు దూకి.. యువకుడి అవతలి వైపుకు తోశాడు. అలా వారు ట్రాక్ మీద నుంచి పక్కకు వెళ్లిన మూడు సెకన్లలోనే రైలు వేగంగా దూసుకొచ్చింది. లక్కీగా ఇద్దరికీ ఏమీ కాలేదు. 


Also read: చర్మక్యాన్సర్ వచ్చిన విషయాన్ని కళ్లు చెబుతాయా? లక్షణాలెలా ఉంటాయి?


ఆ తర్వాత హృషికేష్ బాలుడిని ఫ్లాట్‌ఫారమ్ మీదకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆ యువకుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి అతడి సమస్యను తెలుసుకొనే ప్రయత్నం చేసినట్లు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్(GRP), విజయ్ దారేకర్ తెలిపారు. అతనికి కౌన్సెలింగ్ కూడా ఇచ్చామన్నారు. ఇదంతా రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమేరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. ఆ కానిస్టేబుల్ సహసాన్ని చూసి.. అంతా అతడిని ‘సూపర్ కాప్’ అని పొగుడుతున్నారు. ఈ వీడియోను చూస్తే మీరు కూడా హృషికేష్‌ను ప్రశంసలతో ముంచెత్తుతారు. 


Also read: త్వరలో మగవారికీ గర్భనిరోధక మాత్రలు, అవి వస్తే ఆడవారి కష్టాలు తీరినట్టే


జీఆర్పీ కానిస్టేబుల్ ఆ యువకుడిని ఏ విధంగా రక్షించాడో ఈ వీడియోలో చూడండి: