మూడు రాజధానులే తమ ప్రభుత్వ విధానం అని సీఎం జగన్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. ఈ అంశంపై మాట్లాడిన సీఎంజగన్ న్యాయవ్యవస్థపై కొన్ని వ్యాఖ్యలు చేశారు.  


మెరుగైన చట్టం తీసుకొస్తామని ఊహించి కోర్టులు తీర్పులు ఇవ్వకూడదు : సీఎం జగన్


మూడు స్థంబాలు ఒకరి పరిధిలోకి ఇంకొకరు రానప్పుడే వ్యవస్థలు నడుస్తాయని అంతా వివరించారని తెలిపారు. ఇవాళ ఎందుకు ఈ డిబేట్ జరుగుతోందంటే.. కోర్టులు శాసనసభను డైరెక్ట్ చేయకూడదన్నారు. రాబోయే రోజుల్లో చట్టం రాబోతుందని వాళ్లంతటే వాళ్లే ఊహించుకొని చెప్పడం సరికాదన్నారు. మూడు రాజధానులపై చట్టమే లేదు. కానీ ఈ తీర్పు ఎందుకు వచ్చిందో తెలియదన్నారు. మెరుగైన  చట్టం తీసుకొస్తామని ముందుగానే ఊహించి కోర్టులు తీర్పులు ఇవ్వకూడదని జగన్ అన్నారు. చట్టం చేసే అధికారం శాసనసభకే ఉందని గుర్తు చేశారు. ఇది వేరే వ్యవస్థల పని కాదు. ప్రజలకు మంచి చట్టాలు తీసుకొస్తే అదే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. లేకుంటే మారిపోతారు. గత ప్రభుత్వ పాలసీలు నచ్చలేదు కాబట్టే 151 స్థానాలు ఇచ్చి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారని జగన్ తెలిపారు. ఆ పాలసీని వ్యతిరేకించారు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. 


గడువులు పెట్టడం సరి కాదని కోర్టుకు సభ ద్వారా చెబుతున్నాం : సీఎం జగన్ 


ప్రతి ఐదేళ్లకోసారి పరీక్ష రాస్తాం. అదే ప్రజాస్వామ్య అద్భుతం. కోర్టులు గడువులు ఇవ్వకూడదన్నారు. నెలరోజుల్లో లక్షకోట్లు ఖర్చు పెట్టి రోడ్లు, విద్యుత్ ఇవ్వాలి. ఆరునెలల్లో రాజధాని కట్టాలనే సాధ్యంకాని గడువులు ఇవ్వకూడదని తెలిపారు. ఇలా డిక్టేట్ చేయకూడదు... ఇది సరికాదని సభ ద్వారా చెబుతున్నామని న్యాయవ్యవస్థకు తెలిపారు. మొదటి తెలంగాణ ఉద్యమం అన్నది అభివృద్ధి లేకపోవడం వల్ల వస్తే రెండోసారి అభివృద్ధి కేంద్రీకృతం అవ్వడం వల్లే వచ్చిందని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. వికేంద్రీకరణ ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని శివరామకృష్ణన్‌ కమిటీ పరిగణలోకి తీసుకోవాలి. మూడు రాజధానుల బిల్లులు ప్రవేశ పెడుతున్న టైంలో ఇవన్నీ ప్రస్తావించాం. మూడు రాజధానుల బిల్లులు ప్రవేశపెడుతున్న సందర్భంలో మేం చెప్పినదానికి కట్టుబడి ఉన్నాం. మూడు రాజధానులే మా విధానం అని జగన్ స్పష్టం చేశారు. 


కోర్టు తీర్పు పరిధి దాటింది : సీఎం జగన్


కోర్టు తీర్పు శాసనసభను ప్రశ్నించేలా ఉందని గుర్తుంచుకోవాలని జగన్ తెలిపారు. ఒకరిపై ఒకరు పెత్తనం లేకుండా మూడు వ్యవస్థలు పనిచేయాలన్నారు.  కానీ ఇటీవల న్యాయవ్యవస్థ పరిధి దాటిందన్నారు. అందుకే దీనిపై డిస్కషన్ చేస్తున్నామన్నారు.  రాజధాని ఎక్కడ ఉండాలన్న  నిర్ణయించే అధికారం శాసనసభకు లేదని కోర్టు పేర్కొందని.. పరిపాలన వికేంద్రీకరణపై అసంబ్లీకి అధికారం  లేదని చెప్పిందన్నారు.  ఆ నిర్ణయాధికారం కంద్రం పరిధిలోనే ఉంటాయి తప్ప అసెంబ్లీకి ఎలాంటి అధికారం లేదని పేర్కొందన్నారు. కేంద్రం నుంచి అనుమతి తీసుకోవడం తప్ప  రాష్ట్ర  ప్రభుత్వం చేయడానికి ఏం లేదని చెప్పిందని జగన్ అన్నారు.  


రాజధాని ఏర్పాటులో కేంద్రం పాత్ర ఉండదు : జగన్ 
 
హైకోర్టు తీర్పు దేశ సమాఖ్య స్పూర్తికి శాసనసభ అధికారులకు విరుద్దమని జగన్ అన్నారు. రాజధానిలో కేంద్రం పాత్ర ఏమీ ఉండదని  ఇది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అంశమన్నారు.కేంద్రమే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పిందన్నారు. రాజధానితో పాటు పరిపాలన వికేంద్రీకరణలో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు.  ఒకవైపు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాన్ని డిసైడ్‌ చేసే అధికారం చెబుతోంది. దానికి విరుద్దంగా కేంద్రం చెబుతోంది. ఆ అధికారం లేదని చెప్పడం ఎంత వరకు సమంజమో కోర్టు చెప్పాలన్నారు.  హైకోర్టును అధికారులను అగౌరవపరచడానికి ఈ డిస్కషన్ జరగడం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలు, హక్కులు కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఉందని జగన్తెలిపారు. ఇది అవాంఛనీయమైన సంఘర్షణేనన్నారు. ఈ ప్రాంతంలో నిర్మాణాలు నెలలో పూర్తి చేయాలని ఆరు నెలల్లో మిగతా నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇది సాధ్యమా అని అడుగుతున్నానని జగన్ ప్రసంగించారు. ఇలా ఆచరణ సాధ్యం కాని ఆదేశాలు జారీ చేయరాదని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు హైకోర్టు తీర్పు పూర్తి భిన్నంగా ఉందని గుర్తు  చేశారు. 


మొత్తం ఇక్కడే ఖర్చుపెడితే మిగతా రాష్ట్రంలో ఏం ఖర్చు పెట్టాలి :  జగన్ 



రాజధాని నగరంతోపాటు ఆ ప్రాంతంలో చూపిన మాస్టర్ ప్లాన్ కేవలం కాగితాలపైనే, గ్రాఫిక్స్ రూపంలోనే ఉన్నాయని సీఎం జగన్ తెలిపారు.  అప్పటి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌ను 2016ఫిబ్రవరిలో నోటిపై చేసింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం కాలపరిమితి ఇరవై ఏళ్లు కాలం కాగా... ప్రతి ఐదేళ్లకోసారి సమీక్షించాలని చెప్పారు. ఇప్పటికి ఆరేళ్లు అంయింది. కేవలం గ్రాఫిక్స్‌కే పరిమితం అయిన ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం కేవలం బేసిక్ మౌలిక సదుపాయాల కోసమే ఆనాడు వాళ్లు వేసిన అంచనా లక్షా తొమ్మిదివేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయన్నాు. ఇప్పటికి అది గణనీయంగా పెరిగి ఉంటుంది. పెరుగుతున్న ధరలను చూసుకుంటే ఈ రాజధాని నిర్మాణం కోసం నలభై ఏళ్లు పడుతుందన్నారు. ఏ రాజధాని అయినా తీసుకుంటే వందల ఏళ్ల తర్వాత అభివృద్ది సాధ్యమైంది. 2016 నుంచి 2019 వరకు తన ప్రభుత్వమే ఉన్నప్పటికీ చంద్రబాబు మూడేళ్లకు కలిపి ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఏ ప్రభుత్వానికైనా అంతకు మించి సాధ్యం కాదన్నారు. రాష్ట్రంలో .00001శాతం ఈ ప్రాంతం ఉంటే.. 99.99999 శాతం మిగతా ప్రాంతమే రాష్ట్రం. అక్కడి పనులు చూసుకొని ఈ ప్రాంతంపై ఎంత ఖర్చు పెట్టగలరో ఆలోచించుకోవాలన్నారు. ఈ ప్రాంతంపై ప్రేమ ఉంది కాబట్టే ఇల్లు కట్టుకున్నానని జగన్ తెలిపారు.  


అమరావతికి 15 నుంచి 20 లక్షల కోట్లు కావాలి : జగన్ 


భవిష్యత్‌లో ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలనే 15 నుంచి 20 లక్షల  కోట్లు అవసరం అవుతాయి. ఇది సాధ్యమేనా అని ఆలోచించాలి. ఇక్కడ కూర్చొని ఓట్ల కోసం, ఊహాజనితమైన నిర్ణయాలు తీసుకుంటే లీడర్ కాలేరు. సాధ్యపడేటట్టు ఉండే ఎందుకు చేయమని జగన్ ప్రశ్నించారు.  ఈ ప్రాంతంపై చంద్రబాబుకు ప్రేమ లేదు. అంత ప్రేమ ఉంటే విజయవాడలోనో గుంటూరులోనో పెట్టేవాళ్లు. ఒక్కసారి డెవలప్‌మెంట్‌ అయి ఉంటే అటోమేటిక్‌గా డెవలప్‌మెంట్‌ అయ్యేదన్నారు. తన బినామీల కోసం అక్కడ రాజధాని అంటూ చెప్పారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఇలాంటి తీర్పులు వచ్చినప్పుడు గమనించాలన్నారు.  సాధ్యం కానివి సాధ్యం చేయమని ఏ వ్యవస్థలను న్యాయవ్యవస్థ నిర్దేశించలేదని దీనిపై న్యాయసలహా తీసుకుంటున్నామన్నారు.  అమరావతి రైతుల ప్రయోజనాలు కాపాడుతాం. వారికి కూడా అండగా నిలుస్తామని జగన్ తెలిపారు. 


వికేంద్రీకరణకు వెనుకడుగు వేయబోం : జగన్


వికే్ద్రీకరణ విషయంలో వెనకుడుగు వేయబోం. ఎందుకంటే వికేంద్రీకరణ అంటే  అందరి ఆత్మగౌరవం అని జగన్ అర్థం చెప్పారు. అందులో ఉంది కాబట్టి అడ్డంకులు ఎదురైనా అదే సరైన మార్గం కాబట్టి అందరికీ మంచి చేసేందుకు మా ప్రభుత్వం ఉంది కాబట్టి చట్ట సభకు ఈ విషయంలో సర్వాధికారాలు ఉన్నాయన్నారు. న్యాయవస్థపై తిరుగులేని విశ్వాసాన్ని ప్రకటిస్తూ వికేంద్రీకరణ మా విధానం రాజధానిపై నిర్ణయం మా హక్కు మా బాధ్యత అని జగన్ ప్రకటించి ప్రసంగం ముగించారు.