Sankranti Celebrations Pigs Fighting In Tadepalligudem: సంక్రాంతి పండుగ అంటేనే గోదావరి జిల్లాలకు పెట్టింది పేరు. ఈ సంబరాల్లో కోడి పందేలు, ఎడ్ల పందేలు మరీ ఫేమస్. ప్రత్యేక బరులను సిద్ధం చేసి మరీ కోడి పందేలు నిర్వహిస్తుంటారు. వీటిని చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా జనం తరలివస్తారు. ఈ పందేల్లో రూ.కోట్లలో చేతులు మారుతుంటాయి.  తాజాగా, కేరళ తరహాలో పడవ పోటీలను సైతం ఆత్రేయపురంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించారు. ఇన్ని పోటీలున్నా సంక్రాంతి సందర్బంగా పందుల పందేలను సైతం నిర్వహించారు. ఇవి కోడి పందేలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటాయి. రూ.కోట్లలోనే బెట్టింగులు నిర్వహిస్తుంటారు. ఏళ్ల తరబడి సంక్రాంతికి వస్తోన్న సంప్రదాయం పాటిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు.


ప.గో జిల్లా తాడేపల్లిగూడెం (Tadepalligudem) కుంచనపల్లి (Kunchanapally) గ్రామంలో సంక్రాంతి సందర్భంగా పందుల పందేల నిర్వహణ ప్రత్యేక ఆకర్షణ. గ్రామంలో పండుగ నేపథ్యంలో ఉత్సాహంగా పందుల పోటీలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండం పందెరాయుళ్లు రూ.కోట్లల్లో బెట్టింగులు కాస్తున్నారు. ఈ విధంగా పోటీలు నిర్వహించడం తరతరాల ఆచారమని నిర్వాహకులు చెబుతున్నారు. మాజీ కౌన్సిలర్ సింగం సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. గిరిజన సంప్రదాయం ప్రకారం పందుల పందేలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.


Also Read: Tirumala News: తిరుమల పరకామణిలో చోరీ - వెలుగులోకి సంచలన విషయాలు, బంగారం బిస్కెట్ మాత్రమే కాదు