Two Wives Murdered Husband In Nalgonda District: కుమార్తెను లైంగిక వేధింపులకు గురి చేస్తోన్న ఓ వ్యక్తిని అతని ఇద్దరు భార్యలు హతమార్చారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో (Suryapeta District) చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని చివ్వెంల మండలం గుర్రంతండాకు చెందిన రత్నావత్ సైదులు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన రమ్యను వివాహం చేసుకోగా ఇద్దరు కూతుళ్లు జన్మించారు. కొన్నాళ్ల తర్వాత మగబిడ్డ కావాలని మొదటి భార్య రమ్య చెల్లెలు సుమను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఓ కుమారుడు సంతానం కలగగా.. ముగ్గురు పిల్లలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు.


కుమార్తెకు లైంగిక వేధింపులు


3 నెలల క్రితం పెద్ద భార్య రమ్య చిన్న కూతురు అనారోగ్యం బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందింది. పెద్ద కూతురు హైదరాబాద్‌లో ఉన్నత చదువులు అభ్యసిస్తోంది. అయితే, చిన్న కూతురు మృతి విషయాన్ని జీర్ణించుకోలేనే సైదులు క్రమంగా మద్యానికి బానిసయ్యాడు. అప్పటి నుంచి అతని ప్రవర్తనలో మార్పు వచ్చి ఇద్దరు భార్యలను మానసికంగా వేధింపులకు గురి చేశాడు. ఇదే క్రమంలో పెద్ద కూతురిపైనా వేధింపులకు పాల్పడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.


హైదరాబాద్‌లో ఉంటున్న కూతురు సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న తండాకు వచ్చింది. సూర్యాపేటలో నూతన దుస్తులు కొనుగోలు చేసుకుని ఇంటికొచ్చిన కూతురితో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు అర్ధరాత్రి వేధింపులకు పాల్పడడంతో తన తల్లులకు విషయం తెలిపింది. దీంతో ఇద్దరు అక్కచెల్లెళ్లు తీవ్ర ఆగ్రహంతో భర్త సైదులు మర్మాంగాలపై రోకలిబండతో చితకబాదగా అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుని చిన్నమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భార్యలిద్దరూ పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలుస్తోంది.


Also Read: Cyber Fraud: సైబర్ మోసంతో రూ.2.42 కోట్లు కొట్టేశారు - బాధితుల్లో శాస్త్రవేత్త, వాట్సార్ గ్రూపులో చేర్చి మరీ..