కామంతో కళ్లు మూసుకుపోతే.. మానవ మృగాలు జంతువులను కూడా వదిలిపెట్టరని మరోసారి నిరూపితమైంది. ఇప్పటివరకు మనం కుక్కలు, ఆవులు, మేకలపై అత్యాచారం చేసినవారి గురించే విన్నాం. కానీ, మహారాష్ట్రలోని గోధానే గ్రామంలో నలుగురు యువకులు ఏకంగా ఉడుము(మానిటర్ లిజర్డ్)పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో పోలీసులు నలుగురు యువకులను అరెస్టు చేశారు. 


సహిదరి టైగర్ రిజర్వ్‌ బెంగాల్ మానిటర్ బల్లి జాతి(ఉడుము)కి ఆవాసం. నిందితులు అటవీ అధికారుల కళ్లుగప్పి ఈ జోన్‌లోకి ప్రవేశించారు. అక్కడ వారికి కనిపించిన ఓ ఉడుముపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను సందీప్ తుక్రమ్, పవార్ మంగేష్, జనార్దన్ కమ్టేకర్, అక్షయ్ సునీల్‌గా గుర్తించారు. సీసీటీవీ ఫూటేజ్‌లో ఆ నలుగురు అక్రమంగా అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు. 


Also Read: రెండు ముక్కలైనా బతికేసిన నాగుపాము, వీడియో వైరల్


మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు తొలుత ఆ నలుగురిని వేటగాళ్లుగా భావించి అరెస్టు చేశారు. అనంతరం ఓ నిందితుడి మొబైల్‌ ఫోన్‌ను పరిశీలించగా.. అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితులు ఉడుముపై సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్న వీడియోను చూసి అధికారులు షాకయ్యారు. వీరంతా కొంకణ్ నుంచి కొల్హాపూర్‌లోని చందోలి గ్రామానికి వేట కోసం వచ్చినట్లు అధికారులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. బెంగాల్ ఉడుము వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం రిజర్వు చేయబడిన అరుదైన జాతి. వారి నేరం రుజువైతే నిందితులకు ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. 


Also Read: వేసవిలో ఫ్యూయెల్ ట్యాంక్ నిండా ఇంధనం నింపితే పేలిపోతుందా? ఈ మెసేజ్‌లో నిజమెంతా?