ప్రేక్షకులు 'థియేటర్లలో సినిమా విడుదల తేదీ ఎప్పుడు?' అనేది చూసుకోవడంతో పాటు 'ఓటీటీ విడుదల తేదీ ఎప్పుడు?' అనేది కూడా చూసుకుంటున్న రోజులు ఇవి. స్టార్ హీరోలు, ఛోటా మోటా యంగ్‌స్ట‌ర్స్‌ అనే సంబంధం లేకుండా... హీరోలందరి సినిమాలు ఈ మధ్య నెల రోజులు తిరక్కుండా ఓటీటీలోకి వస్తున్నాయి. తమిళ స్టార్ హీరో విజయ్ 'బీస్ట్' కూడా అదే కేటగిరీలో చేరబోతోందని సమాచారం.

 

విజయ్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'బీస్ట్'. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. అనిరుద్ సంగీతం అందించిన 'అరబిక్ కుతు...' సాంగ్ వైరల్ అవ్వడంతో సినిమాకు మంచి బజ్, ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ, సినిమాకు సూపర్ హిట్ టాక్ రాలేదు. లేటెస్ట్ అప్‌డేట్‌ ఏంటంటే... మే రెండో వారంలో ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందట. (Beast Movie OTT Release Date)

 


 

ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్ సన్ టీవీ నెట్‌వ‌ర్క్‌కు 'సన్ నెక్స్ట్' ఓటీటీ వేదిక ఉంది. అందులో 'బీస్ట్' తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ వెర్షన్స్ స్ట్రీమింగ్ కానున్నాయని టాక్. 'బీస్ట్' హిందీ వెర్షన్ డిజిటల్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్‌కు అమ్మేశారట. (Beast OTT Release On May 13) మే 13న ఓటీటీలో అన్ని భాషల్లోనూ విడుదల కానుందని తెలుస్తోంది.

 


 

చెన్నైలోని ఓ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి 'బీస్ట్' చిత్రాన్ని ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన  హీరోయిన్ పూజా హెగ్డే (వీడియో):