Husband Found on Instagram: ఉత్తరప్రదేశ్‌లోని ఓ మహిళ తన భర్తను ఇన్‌స్టాగ్రామ్.. రీల్స్‌లో చూసింది. ఇందులో విశేషం ఏముంది అనుకోకండి.. ఆయన ‘మిస్’ అయ్యి ఏడేళ్లయింది. ఉత్తర ప్రదేశ్‌లోని హర్దోయ్‌కు చెందిన జితేంద్ర అలియాస్ బబ్లూ కు 2017లో షీలుతో పెళ్లయింది. కానీ పెళ్లైన ఏడాదికే భార్యను వదిలేసి పారిపోయాడు. చాలా మంది చనిపోయాడనే అనుకున్నారు. కానీ ఉన్నట్లండి.. ఈ మధ్య ఆయన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో ప్రత్యక్షమయ్యాడు… అది కూడా మరో మహిళతో.. ఆరా తీస్తే ఆమె తన రెండో పెళ్లాం అని తెలిసింది.
కట్నం కోసం వేధించి.. కనిపించకుండా పోయాడు
2017 లో పెళ్లైన జితేంద్ర- బబ్లూల సంసారం సజావుగా సాగలేదు. ఏడాదిలోపే జితేంద్ర షీలును కట్నం కోసం వేధించాడు. బంగారం తేవాలని డిమాండ్ చేశాడు. భార్యా భర్తల మధ్య గొడవలు పోలీసుల కేసు వరకూ వెళ్లాయి. తనను కట్నం కోసం వేధిస్తున్నారని షీలు Sandila పోలీసు స్టేషన్‌లో కంప్లయింట్ చేసింది. అయితే జితేంద్రను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులను షాకింగ్ విషయం తెలిసింది. జితేంద్ర ఇంట్లో నుంచి ‘మిస్’ అయ్యాడు. తన కుమారుడు కనిపించడం లేదంటూ జితేంద్ర తండ్రి 2018లో కంప్లెయింట్ చేశారు. అంతే కాదు.. షీలు బంధువులే తన బిడ్డను చంపేసి ఉంటారని అనుమానం కూడా వ్యక్తం చేశాడు. అప్పటి నుంచి మిస్సింగ్ కేసు కొనసాగుతూనే ఉంది. షీలు కూడా తన భర్త ఎప్పటికైనా వస్తాడని ఎదురుచూస్తూ ఉంది.
రోజంతా కుక్కలతో గడుపుతున్న బాలుడు, మాటలు మరిచిపోయి కుక్కలా మొరుగుతున్నాడు
రీల్స్‌లో కనిపించిన జితేంద్ర
అయితే ఏడేళ్ల కిందట ‘అదృశ్యం’ అయిన జితేంద్ర అలియాస్ బబ్లూ రీల్స్‌లో ‘ప్రత్యక్షం’ అయ్యాడు. మరో మహిళతో కనిపించాడు. ఆ రీల్స్ చూసి షాక్ అయిన షీలు పొలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు తెలుసుకున్నదేంటంటే.. పథకం ప్రకారం తాను అదృశ్యం అయినట్లుగా సృష్టించుకున్న జితేంద్ర తర్వాత లుథియానాకు వెళ్లిపోయాడు. అక్కడ తన ఐడెంటిటీ మార్చుకుని మరో మహిళను పెళ్లి కూడా చేసుకున్నాడు. కొత్త భార్యతో సంతోషంతో రీల్స్ చేసుకుంటూ పాత పెళ్లానికి దొరికిపోయాడు. ఇప్పుడు రీల్స్ స్టార్ జితేంద్రను పోలీసులు Sandila కి పట్టుకొచ్చారు. షీలు పెట్టిన పాత కేసులో అదుపులోకి తీసుకున్నారు. అలాగే భార్యన మోసం చేసి పారిపోయిన అభియోగాలను కూడా నమోదు చేశారు.