Maruti Escudo Price, Mileage And Features In Telugu: దేశంలోనే అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి, ఈ రోజు (బుధవారం, సెప్టెంబర్ 3, 2025) కొత్త 5-సీటర్ SUVని లాంచ్ చేయబోతోంది. వాస్తవానికి, ఈ కారు రాక కోసం కస్టమర్లు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు, ఆ ఎదురు చూపులు ఈ రోజు ఫలించనున్నాయి. మారుతి ఎస్కుడో.. Maruti Brezza & Grand Vitara మధ్య స్థాయిలో ఉంటుంది. నేషనల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం, ఈ SUV పేరు మారుతి ఎస్కుడో అని తెలుస్తోంది. విశేషం ఏమిటంటే, మారుతి తన Arena డీలర్‌షిప్ నెట్‌వర్క్ నుంచి దీనిని విక్రయిస్తుంది.
మారుతి ఎస్కుడో ఎలా ఉంటుంది?టెస్టింగ్ టైమ్‌లో చూసిన చిత్రాలను బట్టి, ఎస్కుడో డిజైన్ చాలా మోడ్రన్‌గా & స్టైలిష్‌గా ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో బూమరాంగ్ స్టైల్ 3D LED టెయిల్‌ల్యాంప్‌లు, పెద్ద టెయిల్‌గేట్, షార్క్ ఫిన్ యాంటెన్నా & ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఉంటాయి. ఈ SUV పరిమాణంలో బ్రెజ్జా కంటే పెద్దదిగా & గ్రాండ్ విటారాకు దాదాపు సమానంగా ఉంటుంది. కాబట్టి, ఈ కారులో ఎక్కువ స్థలం & బూట్ సామర్థ్యం ఉంటుందని భావిస్తున్నారు.
ఇంజిన్ & పవర్ట్రెయిన్ ఎంపికలుమారుతి ఎస్కుడో.. Grand Vitara మాదిరిగానే పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్‌తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీనికి మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇస్తారు. దీంతో పాటు, టయోటా 1.5 లీటర్ TNGA స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌ను కూడా అందుబాటులో ఉండవచ్చు. నివేదికల ప్రకారం, కంపెనీ ఈ SUV CNG వెర్షన్‌ను కూడా విడుదల చేయవచ్చు.
ఇంటీరియర్ & ఫీచర్లుఎస్కుడో లోపలి భాగం కూడా చాలా అధునాతనంగా ఉండబోతోంది. 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఉంటుంది, ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇస్తుంది. కస్టమర్ల భద్రత కోసం 6 ఎయిర్ బ్యాగులు, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ & మల్టీ డ్రైవ్ మోడ్స్‌ను ప్రామాణికంగా పరిచయం చేస్తారని భావిస్తున్నారు. దీనితో పాటు, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ & ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లను కూడా చేర్చవచ్చు.
ఉత్పత్తి వివరాలుమీడియా నివేదికల ప్రకారం, కంపెనీ తన ఖార్ఖోడా (హరియాణా) ప్లాంట్‌లో మారుతి ఎస్కుడోను ఉత్పత్తి చేస్తుంది. భవిష్యత్తులో, టయోటా కూడా ఈ SUV ఆధారంగా తన కొత్త మోడల్‌ను కూడా ప్రవేశపెడుతుందని సమాచారం.
ధర & పోటీకంపెనీ, మారుతి ఎస్కుడోను మిడ్-సైజ్ SUV విభాగంలో ప్రవేశపెడుతుంది. ఈ సెగ్మెంట్‌లో ఇది Hyundai Creta & Kia Seltos వంటి ప్రసిద్ధ SUV లతో పోటీ పడనుంది. ఎస్కుడో ధరను లాంచ్ సమయంలో అధికారికంగా ప్రకటిస్తారు. అయితే ఈ SUV దాదాపు రూ. 10 లక్షల నుంచి ప్రారంభమవుతుందని అంచనా. అంటే, ఇది గ్రాండ్ విటారా కంటే చౌకగా ఉంటుంది & బ్రెజ్జా కంటే ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంటుంది.