Minister Lokesh Shared Viral Video: 'ఏపీ సీఎం చంద్రబాబు ఓ సామాన్యుడి పెళ్లికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు.'.. తాజాగా, ఓ పెళ్లిలో సీన్ చూస్తే ఎవరికైనా అలానే అనిపిస్తుంది. కానీ, ఓ మిమిక్రీ ఆర్టిస్ట్ అచ్చం చంద్రబాబు (Chandrababu) వేషధారణలోనే వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది కాసేపు వీడియో పూర్తిగా చూస్తే తప్ప ఎవరికీ అర్థం కాదు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కాగా.. మంత్రి లోకేశ్ (Nara Lokesh) వరకూ ఇది చేరింది. దీన్ని షేర్ చేసిన ఆయన.. 'నేను ఇతనికి అభిమానిగా మారిపోయాను. చంద్రబాబు గారిలా మాట్లాడడానికి కనిపించడానికి ఇతను ఎంత కష్టపడ్డాడో చూడండి.' అంటూ పేర్కొన్నారు.
'మా పెద్దాయనే అనుకున్నా కదా'
కాగా, ఇటీవల జరిగిన పెళ్లిలో ఓ మిమిక్రీ ఆర్టిస్ట్ అచ్చం చంద్రబాబులానే వేషధారణలో హాజరయ్యారు. సెక్యూరిటీ సిబ్బందితో సహా వేదికపైకి వచ్చి ఆయనలానే మాట్లాడి వధూవరులను ఆశీర్వదించారు. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వీడియో గత 2 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన ఓ అభిమాని షేర్ చేస్తూ.. 'వామ్మో.. సడెన్‌గా చూసి మా పెద్దాయన అనుకున్నా. సేమ్ బాబుగారిలానే ఉన్నారు.' అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా, మంత్రి లోకేశ్ సైతం దీనిపై స్పందిస్తూ అతనికి అభిమాని అయిపోయానంటూ వీడియో షేర్ చేశారు.