Man Order Condoms Home: ఇప్పుడు ఆన్‌ లైన్ లో వస్తువులు, ఇంటికి సరుకులు, గిఫ్ట్స్ లాంటివి ఆర్డర్ చేసేయడం చాలా పెరిగిపోయింది. ఎలాంటి ఐటెమ్ అయినా ఇలా ఆర్డర్ పెట్టేస్తే అలా నేరుగా ఇంటికే వచ్చేస్తున్నాయి. లెక్కకు మిక్కిలి ఉత్పత్తులు, ఒక బ్రాండ్ కాకపోతే మరొకటి వందలకొద్దీ ఆప్షన్స్, కూర్చొన్న చోట ఆర్డర్ పెట్టేస్తే ఇంటికి వచ్చి బిగించి వెళ్తున్నాయి సంస్థలు. మనం ఏదైనా షాప్ కు వెళ్లినా, కంపెనీ ఔట్ లెట్ కు వెళ్లినా, ఎంత పెద్ద షోరూముకు వెళ్లినా అక్కడ ఉండే ఉత్పత్తులు చాలా పరిమితం. ఎన్నో బ్రాండ్లు ఉంటాయి. ఆ బ్రాండ్లకు చెందిన అన్ని ఉత్పత్తులను ఎంత పెద్ద షోరూమ్ అయినా మెయింటైన్ చేయలేవు. అందుకే ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులను ఓ 10 వరకు ఉంచితే, చిన్న చిన్న బ్రాండ్ల ఉత్పత్తులు ఒకటీ రెండూ కొన్ని షోరూముల్లో అవి కూడా ఉంచవు. 


ఆన్ లైన్ లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ లాంటి ఈ-కామర్స్ సైట్లు, ఆయా సంస్థల వెబ్ సైట్లు ఓపెన్ చేస్తే.. ఆయా బ్రాండ్లకు చెందిన అన్ని ఉత్పత్తులు కనిపిస్తాయి. ఒకదానితో ఒకటి కంపేర్ చేసుకుని మరీ బడ్జెట్ లో వచ్చేది, నాణ్యమైనది వెతుక్కుని ఆర్డర్ పెట్టుకోవచ్చు. షోరూములకు వెళ్లి ఏదైనా కొంటే దానిని సురక్షితంగా ఇంటికి చేర్చాల్సిన బాధ్యత మనదే. ఒకవేళ షోరూమ్ వాళ్లే డెలివరీ చేసినా అందుకు డబ్బులు తీసుకుంటారు. అదే ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడితే ఫ్రీ డెలివరీ. ఇలాంటి ఎన్నో సౌకర్యాలు ఉంటుండటంతో చాలా మంది ఆన్‌లైన్ కే ఓటు వేస్తున్నారు.


ఆన్ లైన్ లో ఆర్డర్ పెడితే చాలా లాభాలు ఉన్నట్లుగానే చిన్న చిన్న ప్రతికూలతలు కూడా లేకపోలేదు. అలాంటి వాటి వల్ల ఒక్కోసారి చాలా నష్టపోవాల్సి వస్తుంది కూడా. ఓ వ్యక్తి  తాజాగా  ఓ ప్రొడక్ట్ ను ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టాడు. తీరా ఇంటికి వచ్చిన తర్వాత సీన్ అడ్డం తిరిగింది. తన తల్లి చేతిలో కోటింగ్ పడింది. ఆన్ లైన్ డెలివరీ సైట్లు, యాప్స్ లో ఓ వెసులుబాటు ఉంటుంది. ఏదైనా ఆర్డర్ చేస్తే డిఫాల్ట్  అడ్రస్స్, ఆల్రెడీ సేవ్డ్ అడ్రస్ అని ఉంటుంది. ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు మళ్లీ మళ్లీ అడ్రస్ ఫిల్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ సౌకర్యం ఉంటుంది. అదే ఇప్పుడు ఓ వ్యక్తిని చిక్కుల్లో పడేసింది. ఏం జరిగిందంటే..


ఓ యువకుడు ఆన్ లైన్‌లో షాపింగ్ చేశాడు. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ లో తనకు కావాల్సిన ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టాడు. తెలిసి చేశాడో.. అనుకోకుండా జరిగిపోయిందో తెలియదు కానీ.. తాను ఆర్డర్ పెట్టిన ఐటెమ్స్ కు డెలివరీ అడ్రస్ ను తానున్న చిరునామా కాకుండా తన ఇంటి చిరునామా పెట్టేశాడు. దాంతో ఆ పార్శిల్ కాస్తా తన ఇంటికి చేరింది. తన ఇంటికి కొడుకు పేరుపై వచ్చిన ఆ పార్శిల్ ఏంటో తెలుసుకుందామని అతడి తల్లి ఆతృతగా ఆ పార్శిల్ తెరిచింది. లోపల ఉన్న ప్రొడక్ట్ ను చూసి ఆమె షాక్ కు గురైంది. ఎందుకంటే తాను అందుకున్న పార్శిల్ లో కండోమ్స్ ఉన్నాయి.


Also Read: MBBS: ఎంబీబీఎస్‌ స్థానికేతర సీట్లు ఏపీ విద్యార్థులకే! తెలంగాణలోనూ స్థానికులకే!


ఈ సంఘటనకు సంబంధించి ఆ యువకుడి సోదరి ఎలెనా తన ట్విట్టర్ అకౌంట్లో కండోమ్ ప్యాకెట్ ను ఫోటో తీసి పోస్టు చేసింది. అన్నయ్య పాపం అడ్రమ్ మార్చడం మర్చిపోయినట్లు ఉన్నాడని, తన తల్లి ఈ పార్శిల్ అందుకుందని రాసి కండోమ్స్ ఫోటోను షేర్ చేసింది. ఆ పోస్టు కాస్త క్షణాల్లో వైరల్ అయింది. చాలా మంది యూజర్లు ఈ పోస్టు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 






Join Us on Telegram: https://t.me/abpdesamofficial