Viral Video: భూమి తిరగడాన్ని చూశారా? - ఖగోళంలో అద్భుత వీడియో వైరల్

Earth Rotation: భారతీయ ఖగోళ శాస్త్రవేత్త అంగ్‌చుక్ శ్రమించి తీసిన భూ భ్రమణం వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతోంది. నక్షత్రాలు నిశ్చలంగా ఉంటే.. భూమి పరిభ్రమిస్తూ ఉంటుందని ఆయన తెలిపారు.

Continues below advertisement

Earth Rotation Beautiful Video Gone Viral: ఖగోళంలో చాలా అద్భుతాలు చూశాం. తాజాగా, భూ భ్రమణానికి సంబంధించిన అద్భుతమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారతీయ ఖగోళ శాస్త్రవేత్త డోర్జే అంగ్‌చుక్ లద్దాఖ్‌లో భూమి భ్రమిస్తోన్న వీడియోను టైమ్‌లాప్స్‌లో బంధించారు. హాన్లేలోని ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీలో ఇంజినీర్ ఇంఛార్జీగా పని చేస్తోన్న అంగ్ చుక్.. 24 గంటల పాటు టైమ్ లాప్స్ ఉపయోగించి ఈ వీడియో తీశారు. ఈ మొత్తాన్ని ఓ నిమిషం వీడియోగా సిద్ధం చేశారు. ఈ వీడియో భూమి ఎలా భ్రమిస్తుందో స్పష్టంగా చూడొచ్చు. నక్షత్రాలు నిశ్చలంగా ఉంటే.. భూమి పరిభ్రమిస్తూ ఉంటుందని.. ఈ ప్రక్రియను వీడియోలో బంధించేందుకు అనేక ఇబ్బందులు పడినట్లు అంగ్‌చుక్ తెలిపారు.

Continues below advertisement

లద్దాఖ్‌లోని విపరీతమైన శీతల పరిస్థితుల వల్ల వీడియో చిత్రీకరిస్తున్న 4 రాత్రుల్లో టైమర్ పని చేయకపోవడం, పలుమార్లు బ్యాటరీ వైఫల్యాలు వంటి ఎదురుదెబ్బలు తగిలాయని.. అయినా ఎలాగైనా వీడియో రూపొందించాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్లినట్లు అంగ్‌చుక్ తెలిపారు. భూ భ్రమణం గురించి విద్యార్థులు సులువుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేలా వీడియోను రూపొందించాలని తనకు వచ్చిన అభ్యర్థన మేరకు ఈ ప్రాజెక్ట్ చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అద్భుత వీడియో నెట్టింట తాజాగా వైరల్ అవుతోంది.

Also Read: Maha Kumbh Special Story: కలియుగ శ్రవణుడు - చెక్క బండిపై 92 ఏళ్ల తల్లిని మోస్తూ, కాలి నడకన కుంభమేళాకు - సంగంలో స్నానం చేయాలని సంకల్పం

 

Continues below advertisement
Sponsored Links by Taboola