Makhana Benefits : సంపాదన పెరుగుతున్నా కొద్దీ జీవన శైలిలోనూ మార్పులు రావడం సహజం. ఈ బిజీ లైఫ్ లో సంపాదించడం ఎంత ముఖ్యమో ఆరోగ్యంగా ఉండడం అంతకన్నా ముఖ్యం. ఇప్పుడంతా రెడీమేడ్ (Ready-made) లైఫ్ అయిపోయింది. ఏం కావాలన్నా ప్రతీదీ క్షణాల్లో ముందుకొచ్చే కాలంలో ఉన్నాం. దీని వల్ల వచ్చే లాభాల కన్నా నష్టాలే ఎక్కువైపోయాయి. గంటల తరబడి స్ర్కీన్ల ముందు కూర్చోవడం వల్ల సరైన జీర్ణక్రియ లేక అనేక సమస్యలు తలెత్తున్నాయి. అకస్మాత్తుగా, బరువు పెరగడం, పొట్ట పెరగడం వంటి సమస్యలతో పాటు ధీర్ఘకాలిక వ్యాధులూ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కనీసం పోషకమైన ఆహారమైనా తీసుకోవడం ఆవశ్యకం. ఆ విషయానికొస్తే.. రోజూ వారి ఆహారంలో మఖానాను చేర్చుకోవడం అత్యంత మేలు కలుగుతుంది. ఇది బరువు తగ్గడంతో పాటు మొత్తం శ్రేయస్సుకు దోహదపడుతుంది.

బరువు తగ్గేందుకు :  ఫైబర్ (Fiber), ప్రోటీన్ పెద్ద మొత్తంలో ఉండే మఖానా ఆకలి కోరికలను తగ్గిస్తుంది. తరచూ ఏదో ఒకటి తినాలనే కోరికలను నియంత్రించడంతో పాటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

జీర్ణక్రియకు  : మఖానాలో ఫైబర్ పుష్కలంగా ఉంది. ఇది జీర్ణక్రియ(Digestion)ను మెరుగుపరుస్తుంది. మలబద్దకంతో బాధపడేవారికి ఇది మంచి ఔషధంగా పని చేస్తుంది. త్వరగా ఉపశమనం పొందడంలో ఉపయోగపడుతుంది.

వృద్ధాప్య లక్షణాలను తగ్గించేందుకు  :  ఫాక్స్ నట్ (Fox nut) అని పిలుచుకునే మఖానాల్లో యాంటీఆక్సిడెంట్స్ విరివిగా లభిస్తాయి. ముఖంపై ముడతలు లేదా వృద్ధాప్య లక్షణాలను, సంకేతాలను తగ్గించే ఫ్రీ రాడికల్స్(Free radicals)తో పోరాడేందుకు ఇవి సహాయపడతాయి.

గుండె ఆరోగ్యానికి  : మఖానాలో మెగ్నిషియం (megnisum) వంటి చాలా పోషకాలు ఉంటాయి. ఇవి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. గుండె సంబంధిత లేదా జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

నొప్పులు, మంటను తగ్గించేందుకు  :  ఫాక్స్ నట్ లోని ఫ్లేవనాయిడ్స్ (Flavonoids) వాపును తగ్గిస్తాయి. ఇవి యాంటీ బాక్టీరియల్ (Antibacterial) ప్రయోజనాలను అందించే కణజాల పునరుత్పత్తికి సహాయపడతాయి.

ఎముకల ఆరోగ్యాన్ని కాపాడేందుకు : కాల్షియం (Calcium) అధికంగా ఉన్న మఖానాలు ఎముకలను బలోపేతం చేస్తాయి. ఆర్థరైటిస్ (Arthritis) లక్షణాలను తగ్గించడంలోనూ సహాయపడతాయి. 

బ్లడ్ ప్రెజర్, బ్లడ్ షుగర్ ని నియంత్రించేందుకు : ఫాక్స్‌నట్స్‌లో సోడియం (Sodium) తక్కువగా ఉంటుంది, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తపోటు లేదా బీపీని కంట్రోల్ చేసేందుకు మేలు చేస్తాయి.

కిడ్నీ ఆరోగ్యానికి  : మఖానాలు రక్తపోటును నియంత్రించడం, ఒత్తిడిని తగ్గించడంతో పాటు మూత్రపిండాల పనితీరును కూడా మెరుగుపరుస్తాయి.

Also Read : Chicken Cheese Ball : టేస్టీ టేస్టీ చికెన్ చీజ్ బాల్స్ రెసిపీ.. పర్​ఫెక్ట్​ స్నాక్​ కోసం దీనిని తయారు చేసుకోండిలా