Chicken Cheese Ball Recipe : సాయంత్రం పిల్లలకు టేస్టీగా ఏమైనా స్నాక్స్ చేయాలన్నా.. లేదా మీకు స్పైసీగా, క్రంచీగా ఏమైనా ఫుడ్ తినాలనిపిస్తే.. హాయిగా ఇంట్లో చికెన్ చీజ్ బాల్స్ చేసేసుకోండి. వీటిని తయారు చేయడం కష్టమనుకుంటారేమో.. కానీ అస్సలు కాదు. చాలా సింపుల్​గా ఇంట్లోనే అతి తక్కువ సమయంలో చేసుకోగలిగే రెసిపీ ఇది. మరి దీనిని ఎలా చేయాలో.. వాటిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో.. ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు 


చికెన్ - అరకిలో (బోన్ లెస్)


బంగాళ దుంపలు - 3


టమాటో కెచప్ - 1 టేబుల్ స్పూన్


కొత్తిమీర - 1 కట్ట


ఉప్పు - రుచికి తగినంత


చీజ్ - 100 గ్రాములు


గుడ్లు - 2


బ్రౌడ్ పౌడర్ - 1 కప్పు


తయారీ విధానం


చికెన్​ను కడిగి.. ఓ గిన్నెలో వేసి.. దానిలో సాల్ట్ వేసి నీరు వేసి ఉడికించాలి. బంగాళదుంపలను కూడా ఉడికించుకోవాలి. ఈ రెండు ఉడికించుకున్న తర్వాత చికెన్​ను క్రస్ట్​గా చేసుకోవాలి. అలాగే ఆలుపై తొక్కను తీసి.. వాటిని చికెన్​ క్రస్ట్​లో వేసి బంగాళదుంపలను బాగా కలపాలి. దానిలో టమాటో కెచప్, కొత్తిమీర తురుము, ఉప్పు వేసి బాగా కలిపాలి. దానిలో నీళ్లు ఏమి వేయకూడదు.


ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలో గుడ్లు పగలగొట్టాలి. ఎగ్​ని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మిశ్రమాన్ని బాల్స్​గా చేసుకోవాలి. దాని మధ్యలో చీజ్ పెట్టి.. గుండ్రంగా చుట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న బాల్స్​ని ఎగ్​ మిశ్రమంతో కోట్ చేయాలి. అనంతరం బ్రడ్ క్రంబ్స్​లో రోల్ చేయాలి. ఇలా అన్ని చికెన్ బాల్స్​ని సిద్ధం చేసుకుని.. వాటిని పావుగంట ఫ్రిడ్జ్​లో పెట్టాలి. 


స్టౌవ్ వెలిగించి.. దానిపై డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. వేడి అయిన తర్వాత.. ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చికెన్ బాల్స్​ని నూనెలో వేసి.. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. పూర్తిగా గోల్డెన్ కలర్​లోకి వచ్చిన తర్వాత వాటిని నూనె నుంచి తీసేయాలి. ఇలా అన్ని బాల్స్​ని ఫ్రై చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ చికెన్ చీజ్ బాల్స్ రెడీ. 


ఈ టేస్టీ చికెన్ చీజ్ బాల్స్​ని పిల్లలనుంచి పెద్దలవరకు అందరూ ఇష్టంగా తింటారు. సాయంత్రం వీటిని స్నాక్స్​గా చేసుకోవచ్చు. లేదా డిన్నర్​ టైమ్​లో, లంచ్​ టైమ్​లో స్టార్టర్​గా కూడా తీసుకోవచ్చు. వీటిని నేరుగా తినొచ్చు. లేదా గ్రీన్ చట్నీ, టమాటో సాస్​తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ​



Also Read : టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రైడ్ రైస్.. స్ట్రీట్ స్టైల్​ లెవెల్​లో ఇంట్లోనే ఇలా వండేయండి రెసిపీ ఇదే