Snow Sculpture International Championship In USA: ఉలిని ఓర్చే రాయి.. శిల్పంగా మారుతుంది. అద్భుత రూపంగా మార్పు చెందుతుంది. శిల్పులు తీవ్రంగా శ్రమించి ఎంతో సమయాన్ని వెచ్చించి అందమైన శిల్పాలకు రూపం ఇస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రాతి, లోహ శిల్పాలను ఇంతవరకూ మనం చూసుంటాం. అయితే, మంచు శిల్పాలు గురించి ఎప్పుడూ విని ఉండం. తెల్లటి మంచుతో తయారు చేసిన ఆ శిల్పాలు అద్భుతః అనిపిస్తున్నాయి. చూసేందుకు రెండు కళ్లూ చాలడం లేదు. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని (USA) కొలరాడో (Colorado) రాష్ట్రంలో ప్రతి ఏటా జనవరి నెలాఖరులో అంతర్జాతీయ స్నో స్కల్ప్చర్ ఛాంపియన్ షిప్ (Sculpture Championship) నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా ఈ పోటీలు నిర్వహించగా.. భారత్‌కు కాంస్యం దక్కింది. ఈ పోటీల్లో టీమ్ కెప్టెన్ జుహూర్ అహ్మద్.. చెవిటి, మూగ కళాకారుడు భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.
ఈ పోటీల్లో తాము కాంస్యం గెలుచుకోవడం ఆనందంగా ఉందని టీమ్ ఇండియా కెప్టెన్ జహూర్ అహ్మద్ చెప్పారు. ఈ ఏడాది తాము 2 ప్రధాన పోటీల్లో పాల్గొన్నామని.. అందులో ఒకటి మిన్నెసోటాలో, రెండోది కొలరాడోలో అని తెలిపారు. భారత్‌లోని గుల్మార్గ్, సోనామార్గ్, పహల్గామ్‌ల్లో ఇలాంటి పోటీలు నిర్వహిస్తే బాగుంటుందని.. స్థానికుల్లో ప్రతిభ బయటకు వస్తుందని అభిప్రాయపడ్డారు. కాగా.. ఈ అంతర్జాతీయ స్నో స్కల్ప్చర్ ఛాంపియన్ షిప్‌లో వివిధ దేశాల కళాకారులు రూపొందించిన మంచు శిల్పాలను అబ్బురపరిచాయి.