Ennallo Vechina Hrudayam Serial Today Episode త్రినయని సీరియల్ పూర్తి అయిపోవడంతో ఆ సీరియల్ స్థానంలో "ఎన్నాళ్లో వేచిన హృదయం" అనే కొత్త సీరియల్ ప్రారంభం అయింది. త్రినయని సీరియల్ హీరోనే ఇదే సీరియల్‌లోనూ నటిస్తున్నారు. కరాటే కల్యాణి కూడా ఈ సీరియల్‌లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక హీరో బాలరాజు ఇందులో మెంటల్ కండీషన్ బాలేని ఓ చిన్న పిల్లాడిలా నటించాడు. ఈ రోజే మొదటి ఎపిసోడ్ ప్రారంభం అయింది. ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్నతనంలో ఉన్న బాలరాజుకి తన బామ్మ బాలాత్రిపుర సుందరి కథ చెప్తుంటుంది. ఏ సమస్య వచ్చినా ఆ సుందరీ దేవి అమ్మవారిని ఒక్క సారి తలచుకో నిన్ను అమ్మవారే కాపాడుతుందని చెప్తుంది. వాసుకి, నాగభూషణం, బామ్మ, వాళ్ల ఇద్దరు కొడుకులు అనంత్ అనే అమాయకుడు, హీరో బాల పసిపిల్లాడి లాంటి వాడిలో పాటు హీరో చిన్నాన్న పిన్నిల కొడుకు ఫణి (పాములాంటి వాడు) కలిసి ఉంటారు. అందరూ టిఫెన్ చేయడానికి కూర్చొంటారు. బాలరాజు ఎంతో హుందాగా వచ్చి కూర్చొంటాడు. ఇంతలో ఓ సీతాకోక చిలుక వచ్చి బాల దగ్గర వాలడంతో బాల మెదడులో ఒక్కసారి రకరకాలుగా మారి పిచ్చోడిలా ఆ సీతాకోక చిలుక మీదకు కోపంగా వెళ్తాడు. తల్లీతండ్రులతో పాటు తమ్ముడు అనంత్ బాలకు ట్యాబ్లెట్స్ వేసి మామూలుగా మార్చుతారు. హీరోయిన్ త్రిపుర సీతాకోక చిలుకలతో ఆడుకుంటూ పూజ చేసి రెడీ అవుతుంది. గుడి నుంచి బామ్మ ఇంటికి వచ్చే సరికి వాసుకి ఒడిలో బాల పడుకొని ఉంటాడు. అనంత్ బామ్మతో విషయం చెప్తాడు.
బామ్మ: ఎలా ఉండే వాడు ఎలా అయిపోయాడు. వీడి తెలివి వీడి కష్టం అన్నీ ఏమైపోయావి ఎటు పోయావి. చిన్న వయసులో ఎవరికీ అందనంత స్థాయిలోకి ఎదిగాడు. సమస్యలకు ఎదురెళ్లి పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అలాంటి వీడి ఎదుగుదల చూసి ఆ విధాతకే కన్ను కుట్టిందో. ఇక వాడిని ఆ బాలత్రిపురా సుందరే కాపాడాలి. (బాల తక్కువ వయసులోనే బిజినెస్ చేసి మంచి పేరుతో వ్యాపారం వృద్ధి చెందిస్తాడు. ఒక రోజు యాక్సిడెంట్ జరగడంతో బాల మనస్తత్వం చిన్నపిల్లాడిలా మారిపోతుంది.)
త్రిపుర పొద్దున్నే లేచి రెడీ అయి వంట చేసి చెల్లికి లంచ్ బాక్స్ ఇస్తుంది. మరో బాక్స్ రెడీ చేస్తుంది. ఎవరికి అని తన చెల్లి అడిగితే ఊర్వశికి అని చెప్తుంది. ఇంతలో ఊర్వశి తల్లి వచ్చి త్రిపుర పిన్ని వచ్చి ఊర్వశి కోసం బాక్స్ రెడీ చేశావా అని అంటుంది. దాంతో త్రిపుర పిన్నికి బాక్స్ ఇస్తుంది. ఇక త్రిపుర ఇంటి బయట చాలా మంది అబ్బాయిలు వెయిట్ చేస్తుంటారు. ఏంటి ఇంత మంది ఇక్కడ ఉన్నారని ఓ అబ్బాయి అడిగితే ఆ ఇంట్లో ఓ అందగత్తె ఉందని అంటారు. త్రిపుర రావడంతో ఈమెనా అని అడిగితే తను గౌరవం ఇవ్వాల్సిన అమ్మాయి అని తను టీచర్ అని చెప్తాడు. ఇక త్రిపుర చెల్లి ఐరన్ చేసిన డ్రస్ ఊర్వశి వేసుకుంటుంది. తీసి ఇవ్వమని త్రిపుర చెల్లి అడిగితే ఊర్వశి తన తల్లి నచ్చిందని ఇవ్వమని చెప్తారు. ఊర్వశి బయటకు రావడంతో అందరూ తననే చూస్తూ ఉండిపోతారు. ఊర్వశి అక్కడే ఉన్న టీ కొట్టు అమ్మే ఆవిడ దగ్గరకు వెళ్లి తన బ్యూటీ చూడటానికి వచ్చిన వాళ్లు తాగిన టీ వల్ల వచ్చిన డబ్బులో సగం తీసుకుంటుంది.
బాల బామ్మ దగ్గర ప్రసాదం తీసుకొని అరటి పళ్లు తినేసి తొక్కలు ఇంట్లోనే పడేస్తాడు. ఇంతలో అక్కడికి వచ్చిన ఫణి తల్లిదండ్రులు అరటి తొక్క మీద కాలేసి పడిపోతారు. చూడకుండా వేశాడని బామ్మ సర్దిచెప్తే బాల కావాలనే వేశానని చెప్తాడు. ఇక ఫణి తండ్రికి చాలా పెద్ద పట్ట ఉంటుంది. విగ్గు వేసుకొని కవర్ చేస్తుంటాడు. దాంతో బాల చూసి నవ్వుతాడు. దాంతో బాలని తల్లిదండ్రులు పక్కకి తీసుకెళ్తారు. బామ్మ కొడుకు కోడలితో రామాపురంలో ప్రకృతి వైద్యశాలలో చేర్పిస్తే మామూలు మనిషి అవుతాడని చెప్తుంది. ఇక ఫణి తల్లిదండ్రులు ఆ మాటలు విని బాలకి నయనం అవ్వకూడదని వాళ్ల ఆశల్ని అంటిస్తా అంటాడు. అంటించేయడం అన్న మాట విన్న బాల బాబాయ్ విగ్గుకి గమ్ అంటించేస్తాడు. అది తెలియని ఆయన విగ్గు పెట్టుకోవడంతో నెత్తికి విగ్ అంటేస్తుంది. ఆ సీన్ భలే కామెడీగా ఉంటుంది. డాడీకి చెప్తానని పరుగులు తీస్తాడు. ఇద్దరూ కవర్ చేస్తారు. తాము ఊరు వెళ్తామని బయల్దేరుతుంటే బామ్మ ఆపేస్తుంది. అనంత్ వస్తాడని చెప్తుంది.
త్రిపుర స్కూల్‌లో సీతాకోక చిలుక గురించి పాఠం చెప్తుంది. బాల అదే గ్రామానికి వస్తుంటాడు. ఇంతలో స్టూడెంట్ ప్రియ వాళ్ల నాన్నకి యాక్సిడెంట్ అవ్వడంతో త్రిపుర పాపని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తుంది. హాస్పిటల్‌లో ఆ పాప ఏడుపు చూసిన త్రిపుర తన తండ్రికి అయిన యాక్సిడెంట్ గుర్తు చేసుకుంటుంది. ఓ కారు ఢీ కొట్టడంతో త్రిపుర తండ్రి చనిపోతాడు. ఆ యాక్సిడెంట్ చేసింది బిజినెస్ మెన్‌గా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న బాలనే. ఆ టైంలో త్రిపుర తండ్రి చనిపోవడంతో పాటు బాల తల నుంచి రక్తం వచ్చి పసిపిల్లాడిలా మారిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: సంధ్య ఫోన్ కాల్ వినేసిన సత్య.. సంజయ్‌కి వార్నింగ్.. కోడలికి ఉచ్చు బిగించిన మామ!