Ammayi garu Serial Today Episode రాజు ఇంటికి వచ్చిన రూప బంటీ గురించి అందరినీ ప్రశ్నిస్తుంది. ఎవరూ రూపతో ఏం సమాధానం చెప్పరు. బంటీ మనసులో మా ఫ్రెండ్ ఏదోదో అడుగుతుంది.. అందరూ సైలెంట్‌గా ఉన్నారు ఏంటి అని ఆలోచిస్తాడు.
రూప: అమ్మా ఏంటమ్మా నీకు కూడా చెప్పాలి అనిపించడం లేదా.
విరూపాక్షి: ఏం చెప్పాలి.. ఏమని చెప్పాలి.. అయినా రాజు కొడుకుతో నీకు ఏంటి సంబంధం.
రూప: అదేంటి అమ్మ అలా అంటున్నావ్.
విరూపాక్షి: రాజు కొడుకు గురించి నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
రూప: ఏమైంది అమ్మ నీకు మీరంతా నేను ఏదో తప్పు చేసినట్లు మాట్లాడుతున్నారు. రాజు నాకు వాళ్లు ఎవరూ సమాధానం చెప్పకపోయినా నువ్వు చెప్పి తీరాలి. రాజు కాలర్ పట్టుకొని ఎవరూ ఈ బంటీ అని అడుగుతుంది. అమ్మా అని బంటీ అడుగుతుంటే నువ్వు ఎందుకు భయపడుతున్నావ్. చెప్పు రాజు.
పింకీ: ఎవరో అనాథ అని చెప్పారక్క.
బంటీ: ఏంటి నాన్న నేను అనాథనా.
రాజు: కాదు బంటీ నువ్వు అనాథ కాదు నా కొడుకువి.
రూప: అదే రాజు బంటీ నీ కొడుకు ఎలా అవుతాడు. చెప్పు రాజు. మనకి పుట్టిన బిడ్డ చనిపోయాడు. నీ కొడుకు అని బంటీని అంటున్నావ్. ఒకవేళ ఎవరితోనైనా అక్రమ సంబంధం.. రూప అలా అనగానే రాజు కొట్టేస్తాడు.
రాజు: నాగురించి తెలిసిన మీరు ఇలా మాట్లాడకూడదు.
రూప: మరి ఎలా మాట్లాడాలి రాజు నేను ప్రెగ్నెంట్ అయిన నాటి నుంచి ఒక్క రోజు కూడా నన్ను చూడటానికి రాలేదు. 9 నెలల్లో ఒక్క రోజు కూడా నా ఆరోగ్యం గురించి కానీ మన బిడ్డ ఆరోగ్యం గురించి కూడా నువ్వు రాలేదే. ఆఖరికి మన బిడ్డ పుట్టిన ఇదే రోజు కూడా నువ్వు హాస్పిటల్‌కి రాలేదు.
విజయాంబిక: దీపక్ మన కొంప మునిగేలా ఉంది జీవన్‌కి కాల్ చేసి రమ్మని.
ముత్యాలు: మీ ఇంటికి రాకపోవడం ఏంటమ్మా.
పింకీ: వచ్చారు కానీ అక్క ప్రగ్నెంట్ అయిందన్న ఆలోచనతో రాకుండా మందారం చావుకి కారణం అక్క అయిందని డబ్బు కోసం వచ్చారు.
విరూపాక్షి: పింకీ డబ్బు కోసం వచ్చామని నీకు ఎవరు చెప్పారు. ఆ రోజు ఇంటిళ్లపాది వచ్చింది రూప ప్రెగ్నెంట్ అయిందని నువ్వు చెప్పడం వల్లే. ఆ విజయాంబిక దీపక్‌లు గేటు దగ్గర గొడవ చేసి మమల్ని వెనక్కి పంపేశారు.
రూప: అదేంటి అమ్మ అలా చెప్తున్నావ్ మీరు డబ్బు కోసం గొడవ చేస్తున్నారు అని అత్తయ్య, దీపక్ నాన్నకి చెప్పారు.
అప్పలనాయుడు: అమ్మా అక్కడ ఏదో పొరపాటు జరిగిందమ్మా. మేం వచ్చింది నీ కోసమే పెద్దయ్య గారు మమల్ని గెంటేయమని చెప్పడం మీరు కూడా బయటకు రాకపోవడంతో మళ్లీ ఆ ఇంటి వైపే రాలేకపోయాం.
పింకీ: రాజు మరి అక్క డెలివరీ టైంలో కూడా నీకు రమ్మని చెప్పాను కదా ఎందుకు రాలేదు.
మల్లేశ్: రాలేదని ఎవరు చెప్పారు బావ వచ్చాడు.
రూప: రాజు వచ్చుంటే నన్ను చూడటానికి వచ్చేవాడివి నా బాధ చూసేవాడివి మన బిడ్డని కాపాడే వాడివి కానీ మనదురదృష్టం మన బాబు చనిపోయాడు.
రాజు: చనిపోలేదు మీరు చంపేశారు.
రూప: నీకు ఏమైనా పిచ్చి పట్టిందా రాజు ఏ తల్లి అయినా తన బిడ్డని చంపేస్తుందా. ఎముకల విరిగిపోయే అంత నొప్పి భరిస్తుందా. బిడ్డ పుట్టిన తర్వాత అయినా నువ్వు నేను కలుస్తాం అనుకుంటే నేను కన్ను తెరిచేలోపే వాడు కన్ను మూశాడని చెప్పారు.
రాజు: మరి బిడ్డ ముఖం కూడా చూడటం ఇష్టం లేదని దూరంగా తీసుకెళ్లి పాతి పెట్టేయమని చెప్పడం నేను నా కళ్లారా చూశాను.
రూప: అయ్యో రాజు నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావ్ అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే అని రూప విజయాంబిక చెప్పిన స్టోరీ చెప్తుంది. ఆఖరి చూపు చూడమంటే నా బిడ్డ శవాన్ని చూడటం ఇష్టం లేక అలా చెప్పాను.
రాజు: నిజంగా మీరు బిడ్డని పాతి పెట్టమని చెప్పలేదా.
రూప: లేదు రాజు మన ప్రేమ మీద ఒట్టు వేసి చెప్తున్నా నేను అలా చెప్పలేదు. ఇప్పటికైనా చెప్పు రాజు ఈ బంటీ ఎవరు.
బంటీ: నా మీద ప్రమాణం చేసి చెప్పు నాన్న నేను ఎవరు.
రాజు: నువ్వు నా కొడుకు నేను నీ తండ్రి.
రూప: చెప్పు రాజు నా మీద ఒట్టు వేసి చెప్పు బంటీ ఎవరు.
రాజు: ఈ బంటీ మన కొడుకే అమ్మాయి గారు.
రూప షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడకుండా ఏడుస్తుంది. బంటీ రూపతో ఫ్రెండ్ నువ్వు మా అమ్మ అని నాకు తెలియకపోయినా అమ్మలానే చూశావ్ అమ్మ అని పిలవొచ్చా అని అంటాడు. రూప పిలవమని అంటుంది. బంటీ ఎమోషనల్‌గా అమ్మ అనిపిలుస్తాడు. రూప, బంటీ ఒకర్నొ ఒకరు హత్తుకొని ఏడుస్తారు. అందరూ సంతోషంతో కన్నీరు పెట్టుకుంటారు. రాజు కూడా ఏడుస్తాడు. ఇక రూప బిడ్డతో నాకు ఉన్న ఇష్టాలే నీకు ఉన్నా గుర్తించలేకపోయాను అని సారీ చెప్తుంది. ఇక ముత్యాలు, అప్పలనాయుడు రూపకి క్షమాపణ చెప్తే నా భర్త, తల్లే నన్ను అర్థం చేసుకోలేనప్పుడు మీరు ఎలా అర్థం చేసుకుంటారని అంటుంది. దాంతో రాజు రూపకి సారి చెప్పి దగ్గరకు తీసుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: పాపని కాపాడమని చేతులు చాచి సాయం అడిగిన కాంచనను అవమానించిన తండ్రి..!