లార్డ్స్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఉత్కంఠభరితమైన టెస్ట్ సిరీస్ జరుగుతోంది. సిరీస్ లో ఇదివరకే 2-1తో ఆతిథ్య ఇంగ్లాండ్ ఆధిక్యంలో ఉంది. నిర్ణయాత్మక చివరి టెస్టులో భారత్ నెగ్గితే 2-2తో సచిన్- అండర్సన్ టెస్ట్ సిరీస్ డ్రా అవుతుంది. అయితే ఈ టెస్ట్ సిరీస్‌లో భాగంగా జరిగిన లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ సమయంలో ఇద్దరు భారత అభిమానులు ఎస్కార్ట్‌ల కోసం చూశారు. తమ మొబైల్ ఫోన్‌లను అమ్మాయిలను అరెంజ్ చేసే వెబ్‌సైట్‌లను స్క్రోల్ చేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పక్కపక్కనే నిల్చున్న ఇద్దరు భారత అభిమానులు తమ మొబైల్ ఫోన్‌లలో ఎస్కార్ట్ వెబ్‌సైట్‌ను బ్రౌజ్ చేస్తూ కెమెరా చేతికి చిక్కారు.
X ప్లాట్‌ఫామ్‌లో షేర్ అయిన వీడియో ఫుటేజ్ తాజాగా జరిగిందా లేదా పాతదా అనేదానిపై క్లారిటీ లేదు. అయితే మ్యాచ్ సమయంలో ఇద్దరు ఫ్యాన్స్ తమ మొబైల్ లో ఎస్కార్ట్ వెబ్‌సైట్‌ను కాసేపు బ్రౌజ్ చేస్తూ సర్వీసు కోసం సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. మ్యాచ్ ను ఆస్వాదించిన క్రికెట్ ప్రేమికులు.. మ్యాచ్ తరువాత నైట్ ఎలా ఎంజాయ్ చేయాలో ప్లాన్ చేసుకుంటున్నారని నెటిజన్లు ఆ వీడియోపై కామెంట్లు చేశారు. రెడ్డిట్‌లో కూడా ఇలాంటి వీడియో క్లిప్ వైరల్ అవుతోంది.
లార్డ్స్ టెస్ట్‌లో 22 పరుగుల తేడాతో ఓటమితొలి టెస్టును ఇంగ్లాండ్ నెగ్గగా, రెండో టెస్టులో భారత్ సత్తా చాటింది. కీలకంగా మారిన ప్రతిష్టాత్మక లార్డ్స్ టెస్టులో భారత్ పోరాడి ఓడింది. ఉత్కంఠపోరులో 22 పరుగుల తేడాతో లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించింది. 193 పరుగులు ఛేజ్ చేయాల్సి ఉండగా, భారత్ ఒక దశలో 112/8గా ఉంది. అయితే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెయిలెండర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ లతో కలిసి చివరివరకూ పోరాడినా లక్ కలిసిరాలేదు.
చివరికి సిరాజ్ దురదృష్టకర రీతిలో క్లీన్ బౌల్డ్ కావడంతో భారత్ కథ ముగిసింది. దాంతో రవీంద్ర జడేజా 181 బంతుల్లో 61 పరుగులతో నాటౌట్ గా నిలిచి చేసిన పోరాటం వృథా అయింది. ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌన్స్ చేసిన బంతిని సిరాజ్ బ్యాక్ ఫుట్ నుంచి డిఫెన్స్ ఆడాడు. కానీ వెనుకకు వెళ్లిన బంతి వికెట్లను తాకడంతో బెయిల్ కింద పడటంతో ఇంగ్లాండ్ శిబిరంలో సెలబ్రేషన్స్ మొదలయ్యాయి.
మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన నాల్గవ టెస్టును భారత్ డ్రా చేసుకుంది. దాంతో చివరిదైన ఓవల్ టెస్టులో నెగ్గితే సిరీస్ 2-2తో డ్రా అవుతుంది. 5వ టెస్ట్ నాలుగో రోజు బ్యాడ్ లైట్, వర్షం కారణంగా ఆట ముందుగానే నిలిపివేశారు. 5వ రోజు ఇంగ్లాండ్ విజయానికి 35 పరుగులు కావాలి, భారత్ నెగ్గాలంటే మిగిలిన 4 వికెట్లు పడగొట్టక తప్పదు.