Don't sleep Right after a Bath : చాలా మందికి రాత్రి స్నానం చేసి నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల వారికి చాలా రిలాక్స్‌గా అనిపిస్తుందని, మంచి నిద్ర వస్తుందిన భావిస్తారు. అందుకే రోజంతా ఎలా ఉన్నా సరే.. రాత్రి పడుకునే ముందు కచ్చితంగా స్నానం చేస్తూ ఉంటారు. మీకు కూడా ఇలాంటి అలవాటు ఉందా? అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు.
రాత్రి సమయంలో శరీర ఉష్ణోగ్రత సహజంగా తగ్గుతుంది. దీనివల్ల మెదడు నిద్రపోవడానికి సంకేతాన్ని పంపుతుంది. అయితే స్నానం చేసిన తర్వాత శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనివల్ల నిద్రపోవడంలో ఇబ్బంది కలగవచ్చు. అంతేకాకుండా స్నానం చేసి నిద్రపోవడం వల్ల శరీరానికి అనేక రకాల నష్టాలు కలుగుతాయట. స్నానం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల మెదడు బలహీనపడుతుందని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో ఇప్పుడు తెలుసుకుందాం.
మెదడు బలహీనపడుతుందా?
ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే.. స్నానం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల మెదడు బలహీనపడుతుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కానీ దీనివల్ల మరికొన్ని నష్టాలు ఉండవచ్చని చెప్తున్నారు. కాబట్టి రాత్రి నిద్రకు ముందు స్నానం చేయడం మానేయాలని చెప్తున్నారు. లేదంటే తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మరి స్నానం చేసిన వెంటనే కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం.
జుట్టు రాలిపోతుంది
రాత్రుళ్లు తలస్నానం చేసి పడుకుంటే.. ఆ తడితో నిద్రపోవడం వల్ల దిండు లేదా మంచంపై బ్యాక్టీరియా పెరగవచ్చు. ఇది స్కాల్ప్ దెబ్బతినేలా చేస్తుంది. దీనివల్ల జుట్టు రాలడానికి, చుండ్రు సమస్యకు దారితీస్తుంది.
కళ్లలో దురద
రాత్రి నిద్రను చాలామంది వేడి నీటితో చేస్తారు. అయితే ఇలా వేడి నీటితో స్నానం చేయడం వల్ల కళ్లల్లో తేమ తగ్గుతుంది. దీనివల్ల కళ్లు ఎర్రబడి దురద వస్తాయి. దీని కారణంగా కళ్లకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా వస్తాయి.
నిద్ర సమస్యలు
రాత్రిపూట స్నానం చేయడం వల్ల నిద్ర చెడిపోవచ్చు. రోజంతా అలసట తొలగిపోదు. నిద్రకు ఆటంకం కలగడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి. ఇది మెదడుపై కూడా ప్రభావం చూపుతుంది. ఒత్తిడి-డిప్రెషన్ పెరుగుతుంది.
బరువు పెరిగిపోతారు..
రాత్రి భోజనం చేసిన తర్వాత స్నానం చేయడం వల్ల బరువు పెరగవచ్చు. ఇది ఫిట్‌నెస్‌ను దెబ్బతీస్తుంది. అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు కూడా వస్తాయి. ఊబకాయం పెరగడం వల్ల మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.
కీళ్ల నొప్పులు, కండరాల తిమ్మిరి
రాత్రిపూట స్నానం చేయడం వల్ల కీళ్ల నొప్పులు వస్తాయి. దీనివల్ల నడవడానికి ఇబ్బంది పడవచ్చు. ఆలస్యంగా స్నానం చేయడం కండరాల తిమ్మిరికి కూడా కారణం కావచ్చు. ఇది కీళ్ల సమస్యలకు దారి తీస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.