Hyderabad Man Wins Guinness Record By Typing: సాధారణంగా మనం కంప్యూటర్ కీబోర్డుపై A నుంచి Z వరకూ టైప్ చేసేందుకు ఎంత టైం పడుతుంది.?. బాగా ప్రాక్టీస్ ఉన్న వారికైతే నిమిషాలు పట్టొచ్చు. అలవాటు లేని వారికి ఇంకాస్త ఎక్కువ టైం పట్టొచ్చు. అదే కీబోర్డుపై Z నుంచి A వరకూ టైప్ చేయాలంటే ప్రాక్టీస్ ఉన్న వారికైనా చాలా టైం పడుతుంది. అలాంటిది హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి కేవలం 3 సెకన్ల లోపే కంప్యూటర్ కీబోర్డుపై చేతివేళ్లతో అద్భుతం చేశాడు. కేవలం 2.69 సెకన్లలోపే కీబోర్డుపై Z నుంచి A వరకూ టైప్ చేసి అబ్బుర పరిచాడు. ఈ అరుదైన ఘనతతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించాడు.
వీడియో వైరల్
హైదరాబాద్ (Hyderabad)కు చెందిన షేక్ అష్రాఫ్ (Ashraf) ఈ అరుదైన ఘనతను సాధించారు. కేవలం 2.69 సెకన్లలోనే కీబోర్డుపై Z నుంచి A వరకూ రివర్స్ లో టైప్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్స్ రికార్డ్స్ వారు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఆయన ప్రతిభను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అష్రాఫ్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో (Telangana Highcourt) న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన ఫిబ్రవరి 2024లో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ను కీబోర్డుపై వేగంగా వెనుకకు టైప్ చేసి టైటిల్ కోసం ప్రయత్నించారు. ఇంగ్లీష్ ఆల్పాబెట్స్ ను వెనుకకు 2.69 సెకన్లలోనే టైప్ చేసి ఇంతకు ముందు 3.71 సెకన్లలో ఉన్న గిన్నిస్ రికార్డును బద్దలుకొట్టి రికార్డు సృష్టించారు.