Delhi Metro: ఢిల్లీ మెట్రో స్థానికుల అవసరాలు ఎంత వరకు తీరుస్తుందో మనకు తెలియదు కానీ.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లుగా చెప్పుకునే వారికి మాత్రం బాగానే ఉపయోగపడుతోంది. ఎప్పుడూ ఏదో ఒక వీడియోతో ఢిల్లీ మెట్రో నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. మెట్రోలో రొమాన్స్, కిస్సింగ్ ల దగ్గరి నుంచి క్లబ్ లో చేసే తరహా పోల్ డ్యాన్సులు, కొట్లాటలు, డ్యాన్సులు, రీల్స్, చిత్ర విచిత్ర సంఘటనలు, హెయిర్ డై చేసుకోవడం, మెట్రో సాకెట్స్‌తో హెయిర్ స్ట్రైటనింగ్ చేసుకోవడం, అర్థనగ్నపు దుస్తులు ధరించడం, మెట్రోలోనే స్నానం చేయడం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వీరి వింత ప్రవర్తనలకు చిన్న పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు, వృద్ధులు, మిగతా వారు కూడా ఇబ్బంది పడుతున్నా.. పట్టించుకోకుండా రకరకాల వీడియోలు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వైరల్ అయిపోవాలని, లక్షల్లో వ్యూస్, లైకులు రావాలని తెగ ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ స్టా, యూట్యూబ్, ఇతర షార్ట్ వీడియో యాప్స్ లో వ్యూస్, లైకుల కోసం రకరకాల విన్యాసాలు చేస్తూ నిత్యం ఢిల్లీ మెట్రోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తాజాగా అలాంటిదే జరిగిందే. ఓ వ్యక్తి చేసిన విన్యాసం ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపించగా.. నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు.
బ్లాక్ కలర్ జీన్స్, బ్లూ, బ్లాక్, యాష్ కలర్ కాంబో కాలర్ టీషర్టు, బ్లాక్ సన్ షేడ్స్, బ్లాక్ గ్లాసీ షూస్ ధరించిన ఓ వ్యక్తి వింతగా ప్రవర్తించాడు. ఎలా అంటే.. మ్యాట్రిక్స్ మూవీలో బుల్లెట్లు షూట్ చేస్తుంటే హీరో తప్పించుకునే సమయంలో చేసినట్లు చేయడానికి తెగ ప్రయత్నించాడు. ఆ తర్వాత సెల్ ఫోన్ పట్టుకుని సెల్ఫీ తీసుకుంటున్నట్లుగా అటు ఇటు తిరుగుతూ ప్రయాణికులను ఆగం చేశాడు. ఇప్పుడు ఇతగాడి వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కాగానే.. నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
Also Read: IRCTC Scam: రైలు టికెట్ క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నించి రూ.4 లక్షలు పోగొట్టుకున్నాడు
బూతులు తిట్టుకున్న మహిళలు
కనీసం పిల్లలున్నారని కూడా ఆలోచించకుండా ఢిల్లీ మెట్రోలో ఇద్దరు మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం వీడియో వైరల్‌గా మారింది. ఇందులో ఇద్దరు మహిళలు సీటు కోసం గొడవ పడ్డారు. ఒకరినొకరు వేలు చూపించుకుంటూ వాగ్వాదానికి దిగారు. ఓ మహిళ వారిని వారించడానికి యత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇతరులకు ఇబ్బంది కలుగుతుందనే ఆలోచన కూడా లేకుండా గొడవపడ్డారు. అందులో గులాబీ రంగు దుస్తులు ధరించిన ఒక మహిళ, నల్లటి దుస్తులను ధరించిన మరో మహిళపై అరుస్తూ కనిపించింది. "హా హు మై పాగల్ (అవును నాకు పిచ్చి ఉంది)" అని ఆమె ఆ స్త్రీపై అరుస్తుంది. అవతలి మహిళ స్పందిస్తూ “భౌక్, తుజే జిత్నా భౌక్నా (మీకు కావలసినంత అరవండి)” అని ఆమె చెప్పడం వినిపించింది.
మెట్రో అధికారులు గొడవలకు దూరంగా ఉండాలని ప్రయాణికులను కోరుతున్నా... వారిలో ఎలాంటి మార్పు రావడం లేదు. మరొక క్లిప్‌లో పింక్ సూట్ ధరించిన మహిళ అదే మెట్రో కోచ్‌లో మరొక ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగింది. మరొక మహిళ ఆ వాగ్వాదాన్ని రికార్డ్ చేసింది. దీనిపై మెట్ర ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి సమస్యలకు అధికారులు ఎలా చెక్ పెడతారో వేచి చూడాల్సిందే !