Viral News: నా పొలంలో మొలకలు వచ్చాయి, 10 రోజుల్లో గ్రోత్ చూశారా.. సోషల్ మీడియాను షేక్ చేసిన పోస్ట్

Hair Growth Tips | యువతను వేధిస్తున్న ముఖ్యమైన సమస్యల్లో బట్టతల ఒకటి. ఓ యువకుడు తనకు వెంట్రుకలు మళ్లీ వస్తున్నాయంటూ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది.

Continues below advertisement

Hair Fall Problem in Youth | హైదరాబాద్: ఈరోజుల్లో యువకుల్ని ఎక్కువగా వేధిస్తున్న సమస్యలలో బట్టతల ఒకటి. ఆధునిక జీవనశైలిలో మార్పులతో పాటు పని ఒత్తిడి, కుటుంబ, వ్యక్తిగత సమస్యలతో చాలా మందిలో వెంట్రుకలు ఈజీగా రాలిపోతుంటాయి. వాటి స్థానంలో కొత్త వెంట్రుకలు వస్తే పర్వాలేదు. కానీ, మళ్లీ వెంట్రుకలు రాకపోవడంతో బట్టతల సమస్య మధ్య వయసు వారితో పాటు యువతలోనూ పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఓ యువకుడు చేసిన పోస్టు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Continues below advertisement

తాను పాటించిన ఓ విధానంలో తనకు కొత్తగా వెంట్రుకలు వస్తున్నాయని యువకుడు తెలిపాడు. 10 రోజుల్లో వచ్చిన గ్రోత్ చూడండి, నా పొలంలో మొలకలు వచ్చాయి అంటూ ఆకర్షించేలా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. పది రోజుల కిందట తలపై ఉన్న వెంట్రకలు, పది రోజుల తరువాత వచ్చిన మార్పును సూచించేలా ఆ యువకుడు రెండు ఫొటోలను జత చేశాడు. హెయిల్ గ్రోత్ బాగుందని విలేకరి కొడుకు అనే పేరుతో ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. అసలే బట్టతల సమస్యతో బాధపడుతున్న వారు అతడి నుంచి టెక్నిక్ తెలుసుకునేందుకు ప్రయత్నించారు.

నిజంగానే పనిచేస్తుందా అన్న..

ఇంతకీ ఏం ఎరువులు వాడుతున్నావు బ్రో అని ఓ నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేశాడు. ఇంతకీ ఏం వాడుతున్నారో చెప్పండన్న, అది నిజంగానే పనిచేస్తుందా అని పలువురు ఆ పోస్టుకు రిప్లై ఇచ్చారు. పలువురు తనను అడగడంతో కొందరికి వ్యక్తిగతంగా మెస్సేజ్ చేసిన ఆ నెటిజన్.. ఆ తరువాత తన తలపై వెంట్రుకల గ్రోత్‌కు కారణం తెలిపాడు. తాను ఇటీవల గుండు చేయించుకున్నానని, అలోవెరా రాసి, ఎండిపోయాక తలస్నానం చేస్తున్నట్లు చెప్పాడు. ఎండలో గుండు ఎక్స్‌పోజ్ కాకుండా చూసుకోవాలని సూచించిన అతడు.. రాత్రిపూట ఈ సీరం అప్లై చేసుకోవాలి. ఉదయం లేచాక తలస్నానం చేసుకోవాలి. నా తలకి మాత్రం బాగానే పనిచేసిందని తాను వాడుతున్న సీరం ఫొటోను షేర్ చేశాడు.

తాను ఆ సీరం కొనమనిగానీ, అది వాడాలని కానీ ఎవరికీ ప్రమోట్ చేయడం లేదన్నాడు. తనకు అలేఖ్య లాగ ఫేమస్ అవ్వాలని కూడా లేదని పేర్కొన్నాడు. సీరంతో పాటు ఎలా వాడుతున్నాడో చెప్పిన తరువాత సోషల్ మీడియాలో వైరల్ అయింది. తలంతా రాసుకోవాలా లేక బట్టతల ప్రాంతంలోనే రాసుకోవాలా అండి? అని ఒకరు, ఏమీ అనుకోకుండా కొంచెం అర్థమయ్యేలా చెప్పాలని మరో నెటిజన్ కోరాడు. నిజంగానే అలోవెరా తలకు రాస్తున్నారా, సిరం ఎలా అప్లై చేస్తున్నారు తల మొత్తానికా, వెంట్రుకలు పోతున్న చోట రాసుకోవాలా అని మరికొందరు నెటిజన్లు వరుస ప్రశ్నలు సంధిస్తున్నారు.


ఏది ఏమైతేనేం, తనకు హెయిర్ ఫాల్ అవుతుండటంతో తాను పాటించిన చిన్న టెక్నిక్ ను ఓ యువకుడు షేర్ చేసుకోగా.. అది తెలుసుకునేందుకు నెటిజన్లు అడిగిన సందేహాలకు తనకు తెలిసిన విషయాలు షేర్ చేసుకోగా ఆదివారం ఉదయం నుంచి ఈ పోస్టులు వైరల్ అవుతున్నాయి. బట్టతల మీద పోస్ట్ చేయకుండా ఉండాల్సింది అంటూ చివర్లో మరో పోస్ట్ కూడా చేశాడు.

అయితే ఏదైనా మెడికల్ ప్రొడక్ట్ లాంటివి వాడే ముందు డాక్టర్‌ను సంప్రదించడం బెటర్. ఒక్కో వ్యక్తి ఆరోగ్యం, తల, బాడీ నేచర్ ఒక్కో విధంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. డాక్టర్ సలహా మేరకు ఏదైనా మెడికల్ ప్రొడక్ట్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. 

 

Continues below advertisement