Snake In Lord Ganeshas Neck In Jagitial: జగిత్యాల (Jagitial) పట్టణంలో సోమవారం అరుదైన ఘటన చోటు చేసుకుంది. గణేశుని విగ్రహం మెడలో ఓ నాగుపాము అలంకారంగా మారింది. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వాణినగర్‌లోని త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో 40 అడుగుల భారీ వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం యథావిధిగా భక్తులు పూజలు చేస్తున్న సమయంలో ఓ నాగుపాము హల్చల్ చేసింది. పాక్కుంటూ వెళ్లి గణపతి మెడలో చుట్టుకుని అలంకారంగా మారింది. కొంతసేపు అలాగే ఉండి అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ దృశ్యాలను చూసిన భక్తులు అవాక్కయ్యారు. సోమవారం కావడంతో శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగుపాము ఆయన కుమారుడి మెడలోకి చేరిందంటూ ప్రత్యేక పూజలు చేశారు. ఇది నిజంగా విశేషమంటూ పేర్కొన్నారు. కాగా, ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.


Also Read: Hyderabad News: లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి