Software Engineer Died In Hyderabad: అప్పటివరకూ ఉత్సాహంగా లడ్డూ వేలంలో పాల్గొన్నాడు. పోటాపోటీగా పాట పాడి రూ.15 లక్షల వరకూ గణేశుడి లడ్డూ వేలంలో పాల్గొన్నాడు. అనంతరం హుషారుగా తీన్మార్ స్టెప్పులు వేశాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని (Hyderabad) మణికొండ పరిధి అలకాపురి టౌన్‌షిప్‌లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అలకాపురి టౌన్ షిప్ పరిధిలో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవాల్లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు. కమిటీ నిర్వహించిన లడ్డూ వేలంపాటలో పాల్గొని రూ.15 లక్షల వరకూ పాడాడు. అనంతరం స్నేహితుడు లడ్డూ కైవసం చేసుకోవడంతో అతడి ముందు ఉత్సాహంగా తీన్మార్ స్టెప్పులు వేశారు.
వినాయకుడి ముందు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. అనంతరం ఇంటికి వెళ్లి శ్యాంప్రసాద్ ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయాడు. గుండెపోటుతో అతను మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, కాలనీవాసులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.