Man ate 8 Kg of Biryani : బాగా ఆకలి ఉన్నప్పుడు వేడి వేడి బిర్యానీ తెచ్చి ముందు పెడితే ఎలా అనిపిస్తుంది.. వెంటనే ఆవురావురుమని తినేయాలనిపిస్తుంది కదా.. అందులోనూ హైదరాబాద్ బిర్యానీ. వింటుంటేనే నోరూరుతుంది కదా. మామూలుగా అయితే ఒక ఫుల్ మీల్స్ బిర్యానీ తింటాం. ఓ రేంజ్ లో ఆకలి ఉంటే ఎక్కువలో ఎక్కువ 2 ఫుల్ మీల్స్ తింటారేమో. కానీ కేజీలకు కేజీలకు బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా.. అది కూడా గంటలోపే.. అసలు ఎవరైనా అలా తింటారా.. తిన్నాక ఉంటారా.. ఇది వినడానికే ఇలా అనిపిస్తే.. ఓ వ్యక్తి దాన్ని నిజం చేశాడని తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉంటామా.. అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియోలో ఓ వ్యక్తి భారీ మొత్తంలో బిర్యానీతో పాటు అందులోని ముక్కలను కాస్త కూడా వదలకుండా తినేశాడు. అతను తిన్నది ఒక కేజీనో, రెండు కేజీలో కాదు.. ఏకంగా 8కేజీల బిర్యానీ. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అసలు అంత ఫుడ్ అతని కడుపులో ఎలా పట్టింది.. ఒక మనిషి అంత బిర్యానీ తింటాడా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
8 కేజీల బిర్యానీ తిన్న సోషల్ మీడియా యూజర్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ఓ వ్యక్తి హైదరాబాదీ బిర్యానీ రుచిని ఆస్వాదిస్తూ కనిపించాడు. చాలా సంవత్సరాలుగా ఆహారం తిననట్లు తినడం చూడవచ్చు. అలా ఆ వ్యక్తి మొత్తం 8 కిలోల బిర్యానీని ఒకేసారి తిన్నాడు. తీవ్రమైన ఆకలితో ఉన్న ఈ కుర్రాడు కెమెరా ముందు ఒంటరిగా కనిపించాడు. బిర్యానీ తిని, ఆపై ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా దృష్టిని ఎంతగానో ఆకర్షిస్తోంది.
వీడియో ప్రారంభంలో ఓ వ్యక్తి వచ్చి ఒక పెద్ద గిన్నెలో ఉన్న వేడి వేడి బిర్యానీని టేబుల్ ముందు కూర్చున్న వ్యక్తికి ఎదురుగా ఉన్న ఆకుపై బోర్లించాడు. అలా ఆ కుర్రాడు ఫుడ్ ను కెమెరాకు చూపించి తినడం స్టార్ట్ చేశాడు. పెద్ద పెద్ద మటన్ ముక్కలను చేతిలోకి తీసుకుని.. రెండు చేతుల్తో విడదీసి ఫుడ్ ను ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. మధ్య మధ్యలో పెరుగును ముక్కలపై, బిర్యానీలో వేసుకుని తిన్నాడు. అది చాలదన్నట్టు చివర్లో ఎక్స్ ట్రా డ్రింక్ ను కూడా తాగడం మరో పెద్ద హైలెట్. ఫైనల్లీ తాను 58 నిమిషాల్లో 8కేజీల బిర్యానీ తినడంలో సక్సెస్ అయ్యాడు. ఈ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. అతనికి అసలు కడుపు ఉందా.. ఒకవేళ ఉంటే 8 కేజీల ఆహారం పట్టేంత చోటుందా అని విస్తుపోతున్నారు.
ఈ వీడియోను zermattneo అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ అయింది. ఇప్పటివరకు ఈ వీడియోను మిలియన్ల మంది వీక్షించగా.. 27 లక్షల మందికి పైగా యూజర్స్ వీడియోను లైక్ చేశారు. అనేక మంది భిన్న రకాలుగా తమ రియాక్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేశారు. నిజం చెప్పు బ్రదర్.. నువ్వు ఆహారం తీసుకోక ఎన్ని రోజులవుతుంది అని ఒకరు అడగ్గా.. మనిషివేనా నువ్వు అసలు అని కొందరు ఆశ్చర్యపోయారు. ఈ రోబోట్ ను మనిషి రూపంలో ఎవరు ఇక్కడ ఉంచారంటూ ఇంకొందరు చమత్కారమైన కామెంట్స్ చేశారు. ఇతను బతకడానికి కాదు, చనిపోవడానికే తింటున్నాడు అని, ఆ కుర్రాడు చెప్పినట్టు ఇది 8కేజీల బిర్యానీ కాదు.. 2-3 కేజీలు అయి ఉండొచ్చని కొందరు వాదించారు. ఇది తిన్న తర్వాత అతనెలా ఉన్నాడు అని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: Mahakumbh Viral Girl Monalisa: కాటుక కళ్ల చిన్నది.. కుంభమేళాను కట్టిపడేసింది.