Bluetooth Connected Electric Three Wheeler : బ్లూటూత్ కనెక్టివిటీతో భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ త్రీ-వీలర్​ను ప్రారంభించింది TVS. దేశీయ టూ-వీలర్ తయారీ దిగ్గజంగా పేరు తెచ్చుకున్న TVS మోటార్ కంపెనీ.. కింగ్ ఈవీ మ్యాక్స్ (King EV Max) పేరుతో త్రీ-వీలరను విడుదల చేసింది. ఆకట్టుకునే ఫీచర్లతో.. SmartXonnect టెక్నాలజీతో దీనిని రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. మరీ దీని ఫీచర్లు ఏంటి? ధర ఎంత? వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం. 


ఛార్జింగ్, ఫీచర్లు.. 


TVS కింగ్ EV MAXను అధిక పనితీరు గల 51.2V లిథియం అయాన్ LFP బ్యాటరీతో శక్తిని పనిచేస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేసిన తర్వాత 179 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 0-80 శాతం ఛార్జ్​ కోసం 2 గంటల 15 నిమిషాలు.. 100 శాతం ఛార్జ్​ కోసం 3.5 గంటలు సమయం తీసుకుంటుంది. TVS SmartXonnect, King EV MAX వంటి స్మార్ట్ ఫీచర్లను స్మార్ట్‌ఫోన్​తో అనుసంధానం చేయవచ్చు. రియల్ టైమ్ నావిగేషన్, అలర్ట్‌, వెహికల్ డయాగ్నస్టిక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని అద్భుతమైన పనితీరు, కంఫర్ట్​, కనెక్టివిటీని మిళితం చేస్తుంది.


ధర, వారంటీ డిటైల్స్.. 


పట్టణ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని.. క్లీన్ మొబిలిటీ ఎంపికల కోసం TVS కింగ్ EV MAXను తయారు చేసినట్లు తెలుస్తోంది. SmartXonnect టెక్నాలజీతో వస్తోన్న దీని ఎక్స్ షోరూమ్ ధర 2.95 లక్షలు.  ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, బీహార్, జమ్యూ& కాశ్మీర్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్​లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అది కూడా ఎంపిక చేసిన డీలర్​షిప్​లలో ఉంది. మొదటి మూడు సంవత్సరాలకు 24/7 రోడ్ సైడ్ సపోర్ట్ అందించడంతో పాటు.. ఆరు సంవత్సరాలకు లేదా 150,000 కి.మీ వారంటీని ఇస్తున్నారు. 


గరిష్టంగా 60 kmph వేగంతో.. ఎకో మోడ్ 40 kmph, సిటీ 50 kmph, పవర్ 60 kmphతో వస్తుంది. విశాలమైన క్యాబిన్, ఎర్గోనామిక్ సీటింగ్ డిజైన్ ఇచ్చారు. అందుకే ఇది పట్టణ ప్రయాణాలకు సరైనదిగా చెప్తున్నారు TVS మోటార్ కంపెనీ కమర్షియల్ మొబిలిటీ, బిజినెస్ హెడ్ రజత్ గుప్తా. పట్టణ ప్రాంతాలు పెరుగుతున్న నేపథ్యంలో వీటి డిమాండ్ పెరుగే అవకాశముందని తెలిపారు. 2030 నాటికి త్రిచక్ర వాహన విభాగం పూర్తిగా ఈవీలకు మారొచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. ఈవీ విభాగంలో అగ్రగామి సంస్థ ఎదిగేందుకు 125 కోట్ల పెట్టుబడులు పెట్టామని TVS మోటార్ డైరక్టర్, CEO KN రాధాకృష్ణ తెలిపారు. రాబోయే నెలల్లో దేశవ్యాప్తంగా దీనిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. 



Also Read : భారత్ మొబిలిటీ ఎక్స్​పోలో VF7, VF6.. ఆకట్టుకునే ఫీచర్లతో, 10 సంవత్సరాల బ్యాటరీ వారంటీ​తో డెబ్యూ ఇచ్చిన VinFast