Anantapur DRO: కీలక సమావేశంలో కూల్ కూల్‌గా రమ్మీ ఆడిన అనంతపురం డీఆర్ఓ

కీలక సమావేశంలో రమ్మీ ఆడిన అనంతపురం డీఆర్ఓ విషయం వివాదాస్పదమవుతోంది. అధికారిపై కలెక్టర్ చర్యలకు ఆదేశించారు.

Continues below advertisement

అనంతపురం: కీలక సమావేశంలో అనంతపురం డిఆర్ఓ మాలోల రమ్మీ గేమ్ ఆడడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనంతపురం జిల్లా కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్ లో  వేది కపై ఎస్సీ వర్గీకరణ సమస్యపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు సోమవారం వినతిపత్రాలు స్వీకరిస్తూ బిజీగా ఉన్నారు. వర్గీకరణకు వ్యతి రేకంగా, అనుకూలంగా వచ్చినవారితో కలెక్టర్ కార్యాలయం హడావిడిగా ఉంది. ఒకపక్క ఏకసభ్య కమిటీ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజాన్ మిశ్రా వేదికపై ఉన్నారు. మరవైపు పోలీసుల హడావిడి.. అజీల స్వీకరణ కొనసాగుతున్న తరుణంలో అనంతపురం డిఆర్ఓ మాలోల ఆన్లైన్లో తన మొబైల్లో రమ్మీ గేమ్ ఆడుతూ చిక్కాడు. అంత పెద్ద మీటింగ్ జరుగుతూ ఉండి వేదిక పైన గెజిటెడ్ ఆఫీసర్ హోదాలో ఉండి  ఏమి పట్టిం చుకోకుండా స్మార్ట్ ఫోన్లో రమ్మీ ఆడుతూ తన ప్రపంచంలో మునిగిపోయారు. అనంతపురం జిల్లా డీఆర్వో మలోల. వేదికపై తన పక్కనే ఉన్నతాధికారులు.. చూసి ముక్కున వేలేసుకున్నారు.

Continues below advertisement

 కలెక్టర్ చర్యలు: 

ఎస్సీ వర్గీకరణ సమావేశంలో రమ్మీ ఆడుతూ సోషల్ మీడియాలో డిఆర్ఓ మల్లోల వీడియో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఇదే అనిచోట్ల ఆర్ టాపిక్. అయితే ఈ ఘటనపై అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో అని ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉత్కంఠగా ఉంది. డీఆర్‌వోపై చర్యలకు కలెక్టర్ ఆదేశించినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Continues below advertisement