Dead Frog Found In Chips Packet In Gujarat: ఆలూచిప్స్ ప్యాకెట్‌లో (Aloo Chips Packet) చనిపోయిన కప్పను చూసిన ఓ వ్యక్తి షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. జూమ్ నగర్‌లోని (Zoom Nagar) పుష్కర్ ధామ్ సొసైటీకి చెందిన జాస్మిన్ పటేల్ ఇంట్లోని పిల్లలు మంగళవారం మధ్యాహ్నం వీధిలో ఉన్న దుకాణంలో చిప్స్ ప్యాకెట్ కొనుగోలు చేశారు. చిప్స్ తింటుండగా అందులో చనిపోయిన కప్పను చూసిన పిల్లలు ఆందోళనకు గురయ్యారు. వెంటనే జాస్మిన్‌కు చెప్పారు. తొలుత ఆయన నమ్మలేదు. అనంతరం నేరుగా వచ్చి చూడగా నిజంగా చనిపోయిన కప్పను చిప్స్ ప్యాకెట్‌లో గమనించి షాకయ్యాడు. వెంటనే అమ్మిన దుకాణం యజమాని, తయారీదారులకు ఈ విషయం చెప్పాడు. అయితే, వారి నుంచి కనీసం ఎలాంటి స్పందన లేకపోవడంతో బుధవారం పురపాలక అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆ ప్యాకెట్ బ్యాచ్ నెంబర్‌లో ఉన్న మిగతా ప్యాకెట్లనూ స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరీక్షలకు పంపి తనిఖీ చేయిస్తున్నారు. కాగా, చిప్స్ ప్యాకెట్‌లో చనిపోయిన కప్పకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.


Also Read: Viral Video: కానిస్టేబుల్‌కి వడదెబ్బ, హాస్పిటల్‌కి తీసుకెళ్లకుండా వీడియో తీసిన ఎస్సై! బాధితుడు మృతి