Sharmila :  వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల... ఇ కకాంగ్రెస్ పార్టీలో విలీనం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చారు. ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావడంతో ఆమె ఇక పూర్తి స్థాయి కార్యాచరణపై దృష్టి పెట్టారు. కాంగ్రెస్ తో విలీన ప్రక్రియ  అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేలా అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నారు. గురువారం వైఎస్ఆర్‌టీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో  అన్ని చోట్లా పోటీ చేయాలన్న తీర్మానం చేసి.. మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది. 


వీలీనం ప్రయత్నాలు ఫెయిల్ 
 
కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనం ముందకుసాగలేదు.  కాంగ్రెస్‌లో   విలీనం చేయడానికి వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల  కొన్ని డిమాండ్లు.. హైకమాండ్ ముందు ఉంచారు.   బెంగళూరు వేదికగా ట్రబుల్ షూటర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌.. ఢిల్లీ వేదికగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వేణుగోపాల్‌తో వరుస భేటీలు అయినప్పటికీ డిమాండ్స్ విషయంలో తేడా రావడంతో విలీనానికి బ్రేక్ పడినంది.  షర్మిల డిమాండ్స్ విషయంపై ఈ విషయంపై   కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందనరాలేదు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు షర్మిల  పార్టీ విలీనం వల్ల పార్టీ నష్టపోతుందని చెప్పడంతో ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. 


119 స్థానాల్లో వైఎస్ఆర్‌టీపీ అభ్యర్థులు                                                 


విలీనానికి బ్రేక్ పడటంతో ఇక వచ్చే ఎన్నికల్లో సొంతగానే బరిలోకి దిగాలని షర్మిల భావిస్తున్నట్లు తెలియవచ్చింది. అంటే.. విలీనమే కాదు ఎలాంటి పొత్తులు కూడా లేకుండా వైఎస్సార్టీపీ బరిలోకి దిగబోతోందన్న మాట. అంతేకాదు.. అక్టోబర్-09 నుంచి పార్టీ బీ-ఫామ్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గురువారం ప్రకటన చేసే అవకాశం ఉంది.  ఇప్పటికీ ఇందుకు సంబంధించి రంగం సిద్ధం చేసుకున్నారు.  దాదాపు అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో పోటీచేయడానికి షర్మిల సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు.. ఇక కాంగ్రెస్ మాటే ఎత్తకూడదని ఇంత జరిగిన తర్వాత విలీనం అనే ఊసే రాకూడదని షర్మిల నిర్ణయానికి  వచ్చారు. 


పాలేరుతో పాటు మిర్యాగలగూడలో పోటీ ?                                            


ముందుగా అనుకున్నట్లుగానే వైఎస్ షర్మిల  .. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నియోజకవర్గం అయిన పాలేరు అసెంబ్లీ నుంచి బరిలోకి దిగబోతున్నారు. ఇప్పటికే పార్టీ ఆఫీసు, వైఎస్సార్ విగ్రహాన్ని కూడా షర్మిల ప్రారంభించి.. పార్టీ కార్యక్రమాలను షురూ చేశారు. కొత్తగా నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ నుంచిపోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. రెండు చోట్ల పోటీ చేయాలని  పార్టీ శ్రేణులుపై ఆమె పై ఒత్తిడి తెస్తున్నాయని దానికి ఆమె అంగీకరించారని చెబుతున్నారు.