Top 5 Telugu Headlines Today 11 October 2023: 


వన్స్ కేసీఆర్ స్టెప్ ఇన్, తెలంగాణలో హిస్టరీ రిపీటేనా ?
అందరి కంటే ముందే 115 నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. అభ్యర్థుల ప్రకటనతో విపక్షాలకు ఊహించని షాక్ ఇచ్చారు. ఎవరి అంచనాలకు అందని వ్యూహాలతో నెగ్గుకొచ్చే గులాబీ బాస్, ప్రత్యర్థులపై మరోసారి పైచేయి సాధించారు. ఎన్నికలకు ముందే తానేంటో మరోసారి చేసి చూపించారు. ఎన్నికలకు 40 రోజులు ముందే టికెట్లిచ్చామని, గెలుపు విషయంలో సీరియస్ గా ఉండాలని అభ్యర్థులకు చెప్పకనే చెప్పారు. యుద్ధంలో దిగకముందే సగం గెలుపు ఖాయం చేశారు కేసీఆర్. బీఆర్ఎస్ అసంతృప్తుల కోసం ఎదురుచూస్తున్న ఇతర పార్టీలకు, ఆ అవకాశం లేకుండా చేసే ప్రణాళికలు వేశారు. టికెట్లు దక్కనివారు పార్టీలోనే ఉండాలని, తర్వాత మంచి అవకాశాలు వస్తాయని భరోసా ఇచ్చారు. పూర్తి వివరాలు


టోఫెల్ పేరుతో దోచిపెడుతోంది ఏటా రూ.1052 - ఏపీ సర్కార్‌పై జనసేన సంచలన ఆరోపణలు !
ప్రభుత్వ స్కూళ్లలో ఉపాద్యాయులను నియమించుకుండా టోఫెల్ పేరుతో ఓ సంస్థతో ఒప్పందం చేసుకుని ఏటా రూ.1052 కోట్లకు ఎసరు పెట్టారని సీఎం జగన్‌పై జనసేన సంచలన ఆరోపణలు చేసంది.  విచిత్రమైన పథకంతో ఖజానాకు కన్నం వేస్తున్నారన్నరాు.  3 నుంచి 10 విద్యార్థులకు ఏ మాత్రం ఉపయోగపడని టోఫెల్ పరీక్ష ను బలవంతంగా రుద్ేదందుకు  ఈటీఎస్ వెంటపడి మరి ఒప్పందం కుదుర్చుకున్నారని  ఆరోపించారు.  ఏటా రూ.1052 కోట్లకు ఎసరు పెట్టి ఏకంగా  2027 వరకు పథకం ఎంఓయూ కుదుర్చుకున్నారని ఆరోపించారు.  ఇంటికి వెళ్లిపోయే వైసీపీ సర్కార్ హడావిడి ఒప్పందం వెనుక  భారీ స్కాం ఉందన్నరు. పూర్తి వివరాలు


దసరాకు టీడీపీ మేనిఫెస్టో లేనట్టే- చంద్రబాబు విడుదల తర్వాతే అంటున్న నేతలు
ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. 2024 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యం పెట్టుకున్న చంద్రబాబు... ఏడాది ముందు నుంచే ప్రజల్లోకి వెళ్లారు. వైసీపీ  ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఇదేం ఖర్మ వంటి పలు కార్యక్రమాలు చేపట్టారు. ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా రాజమండ్రిలో టీడీపీ నిర్వహించిన మహానాడులో... మినీ  మ్యానిఫెస్టో కూడా ప్రకటించారు చంద్రబాబు. మహిళలకు, రైతులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు అనేక పథకాలు మినీ మేనిఫెస్టోలో పొందుపరిచారు. అంతేకాదు... ఇది ట్రైలర్‌ మాత్రమే అని... దసరాకు మహా మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించారు. పూర్తి వివరాలు


అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గట్టెక్కుతుందా ? సంజయ్ ను తప్పించడంతో కేడర్ గుర్రుగా ఉందా ?
కర్ణాటక ఎన్నికలతో ఫలితాలతో తెలంగాణ బీజేపీలో ఎలాంటి విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా తొలగించడం, కిషన్ రెడ్డిని ఆ సీటులో కూర్చోబెట్టడం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో వర్గ విబేధాలు, రహస్య సమావేశాలు, అసంతృప్తులు ఎక్కువవ్వడం, కార్యకర్తల్లో అయోమయం ఇలా చెప్పుకుంటూ పోతే చిట్టా చాలా పెద్దదే. అంతర్గత గందరగోళ పరిస్థితుల నుంచి ఇప్పట్లో తెలంగాణ బీజేపీ గట్టెక్కేలా కనిపించట్లేదు. పార్టీలోని అసంతృప్తులను బుజ్జగించడమే పనిగా పెట్టుకున్న ఈటల రాజేందర్, చేరికల కమిటీ చైర్మన్ కాస్త బుజ్జగింపుల చైర్మన్‌గా మారిపోయారు. పూర్తి వివరాలు