YS Sharmila :  తెలంగాణ ప్రజలను సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని నాన్న చెప్పారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గుర్తు చేసుకున్నారు. అమరికా పర్యటనలో ఉన్న షర్మిల YSR అభిమానులతో వైఎస్ షర్మిల గారి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు.  YSR రాజకీయ జీవితం 30 ఏళ్లు అని..  ఇందులో 5 ఏళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారన్నారు.  ఆ 5 ఏళ్లు వైఎస్సార్ కోటానుకోట్ల మంది గుండెల్లో నిలిచి పోయారని గుర్తు  చేశారు.  లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశారని.. మహిళలకు పావులా వడ్డీకి రుణాలు ఇచ్చారన్నారు.  వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడేలా ఆర్థికంగా తోడ్పాటు అందించారని గుర్తు చేసుకున్నారు  ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి అయ్యాక తొలి సంతకం ఉచిత విద్యుత్ మీద చేశారన్నారు. 


వైఎస్ తెచ్చిన పథకం వల్ల పేద బిడ్డలు ఫీజు రీయింబర్స్మెంట్ తో పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారని..  దేశంలో ఏ నాయకుడు ఆలోచన చేయని అరోగ్య శ్రీ  పథకాన్ని అమలు చేశారన్నారు.   వైఎస్సార్ ముఖ్యమంత్రిగా 46 లక్షల మంది పేదలకు పక్కా ఇళ్లులు కట్టించారన్నారు.  వైఎస్సార్ మరణం వార్త భరించలేక   700 వంది చనిపోయారు అంటే..వైఎస్సార్ మీద ప్రేమ అంతా ఇంతా కాదన్నారు.  వైఎస్సార్ అంటే ప్రాణం ఇచ్చేంత ప్రేమను ప్రజలు పెట్టుకున్నారన్నారు.  ఎక్కువ శాతం తెలంగాణ లోనే వైఎస్సార్ మరణ వార్త విని చనిపోయారని.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అన్ని ప్రాంతాలను సమానంగా గౌరవించారని షర్మిల తెలిపారు. 
 


ఇవ్వాళ వైఎస్సార్ గారు బ్రతికి ఉన్నా... తెలంగాణ ముఖ్యమా..? ఆంధ్రా ముఖ్యమా అంటే సమాధానం చెప్పలేరన్నారు.  వైఎస్సార్ ను అమితంగా ప్రేమించిన తెలంగాణ ఈరోజు ఎలా ఉందో అందరూ గమనించాలన్నారు.  ఉద్యమ కారుడు కదా అని పాలన చేతిలో పెడితే.. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారని కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.  8 న్నర ఏళ్లలో 8 వేల మంది రైతు .. వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం  చేశారు.  రుణమాఫీ అని రైతులను మోసం చేశారు ... సున్నా వడ్డీకి రుణాలు అని మహిళలను మోసం చేశారు.. కేజీ టూ పీజీ అని విద్యార్థులను మోసం చేశారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇ  35 వేలు కూడా ఇప్పుడు ఇవ్వడం లేదని.. అరోగ్య శ్రీ కేసులు ఆసుపత్రులు  తీసుకోవడం మానేశాయని షర్మిల వివించారు.  


 జలయజ్ఞం పథకంలో బాగంగా తెలంగాణ లోనే ఎక్కువ ప్రాజెక్ట్ లు వైఎస్ కట్టించారన్నారు.  తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నారు అని నాన్న నాకు చెప్పినట్లు అనిపించిందని.. .తెలంగాణ ప్రజలను సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని నాన్న చెప్పారని గుర్తు చేసుకున్నారు.  నన్ను ప్రేమించిన ప్రజలు..నేను ప్రేమించిన ప్రజలు అని నాన్న చెప్పాడని..  తెలంగాణ ప్రజల మేలు కోసం పోరాడాలి అని నాన్న నా గుండెల పై విల్లు రాశాడని షర్మిల భావోద్వేగంగా చెప్పారు. అందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టానన్నారు.  వైఎస్సార్ పార్టీ జెండాలో వైఎస్సార్ ఉన్నాడు..అజెండా లో వైఎస్సార్ సంక్షేమం ఉందని.. మళ్లీ రాజన్న పాలనతీసుకొస్తామన్నారు. 


తెలంగాణ ప్రజల కోసం చిత్త శుద్ది గా నిలబడిన పార్టీ YSR తెలంగాణ పార్టీ అని షర్మిల స్పష్టం చేశారు. ఇప్పటికే 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేశామన్నారు.  ఎమ్మెల్యే ల అవినీతి నీ ఎత్తి చూపించామని..   వైఎస్సార్ తెలంగాణ పార్టీ పోరాటం చేసే వరకు నిరుద్యోగం అనే అంశం చర్చ కే లేదన్నారు.  నిరుద్యోగుల పక్షాన నిలబడ్డాం.. అప్పుడు ప్రతిపక్షానికి సోయి వచ్చింది. అధికార పక్షానికి బుద్ది వచ్చిందని వ్యాఖ్యానించారు.  కాళేశ్వరం దేశంలోనే అతి పెద్ద స్కాం.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 70 వేల కోట్ల అవినీతి జరిగిందని.. దీనిపై ఢిల్లీ వెళ్లి పోరాటం చేశామన్నారు.