Yendluri Sudhakar Passes Away: ప్రముఖ కవి, సాహితీవేత్త ఎండ్లూరి సుధాకర్ కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కవి మరణం పట్ల సాహితీవేత్తలు, రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరి గౌరీశంకర్, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
కవి ఎండ్లూరి మరణం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. ‘అభ్యుదయ స్ఫూర్తినిచ్చే రచనలతో తెలుగు సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సాహితీ వేత్త ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారి మరణం విచారకరం. సుధాకర్ మృతి తెలుగు సాహితీ లోకానికే కాదు, దళిత సమాజానికి కూడా తీరని లోటు’ అన్నారు.
ఆచార్య ఎండ్లూరి సుధాకర్ జనవరి 21, 1959న నిజామాబాద్ లోని పాములబస్తిలో తన అమ్మమ్మ గారి ఇంట్లో జన్మించారు. ఎండ్లూరి దేవయ్య, శాంతాబాయి లకు ప్రథమ సంతానం. ఈయనకు ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు. హైదరాబాద్ వీధి బడిలో ప్రారంభమైన చదువు విశ్వవిద్యాలయం వరకు హైదరాబాద్ లోనే సాగింది . నల్లకుంట ప్రాచ్య కళాశాలలో ఓరియంటల్ విద్య, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం .ఏ, ఎం.ఫిల్, పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేశారు.
ఆయన రచించిన పుస్తకాలు..
వర్తమానం, జాషువా' నాకథ ', కొత్త గబ్బిలం, నా అక్షరమే నా ఆయుధం, మల్లె మొగ్గల గొడుగు, నల్లద్రాక్ష పందిరి, పుష్కర కవితలు, వర్గీకరణీయం, "ఆటా "జనికాంచె..., జాషువా సాహిత్యం- దృక్పథం - పరిణామం, గోసంగి, కథానాయకుడు జాషువా, నవయుగ కవి చక్రవర్తి జాషువా, కావ్యత్రయం, సాహితీ సుధ, తెలివెన్నెల పుస్తరాలు ఎండ్లూరి సుధాకర్ రచించారు.
ఈయన కేంద్ర సాహిత్య అకాడమీ జ్యూరీ సభ్యుడు. తెలుగు సలహా మండలి సభ్యుడు, తెలుగు అకాడమీ సభ్యుడు, ప్రసిద్ధ హిందీ, ఉర్దూ పద్యాల, లఘు చిత్రాల అనువాదకుడుగా సేవలు అందించారు. ప్రస్తుతం హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో సీనియర్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.
Also Read: NeoCov: త్వరలోనే మరో డేంజర్! ఊహాన్ శాస్త్రవేత్తల సంచలన ప్రకటన, ఇది వింటే వెన్నులో వణుకు ఖాయం!