Subbaraya Sastri Is No More: స్కూలు మెట్లు ఎక్కలేదు.. జీవితం పాఠాలు నేర్చిన ‘బుజ్జాయి’ దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి

దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి కేవలం మనుషుల వ్యక్తిత్వాలపై వచ్చే కార్టూన్లు మాత్రమే కాదు తన అద్భుతమైన ప్రతిభతో జంతువులను సైతం పంచతంత్ర కథల్లో మాట్లాడించిన తీరు నిజంగా అమోఘం.

Continues below advertisement

Subbaraya Sastri Is No More: దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి అనే పేరు కంటే తెలుగు వారికి బుజ్జాయి పేరుతో ఆయన ప్రసిద్ధి. తమిళులకు ‘పుచ్చాయి’గా  ఆబాలగోపాలాన్ని అలరించిన దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి ఇక లేరు. గతకొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన ప్రఖ్యాత తెలుగు కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు. 

Continues below advertisement

అలనాటి ఆంధ్ర జ్యోతి పత్రికని నార్ల వెంకటేశ్వరరావు ప్రారంభించినప్పటి నుంచి తన కార్టూన్లతో చిన్నారులతో పాటు పెద్దలను సైతం విశేషంగా ఆకర్షించారు. కేవలం మనుషుల వ్యక్తిత్వాలపై వచ్చే కార్టూన్లు మాత్రమే కాదు తన అద్భుతమైన ప్రతిభతో జంతువులను సైతం పంచతంత్ర కథల్లో మాట్లాడించిన తీరు నిజంగా అమోఘం అని చెప్పవచ్చు. మొట్టమొదటి పిల్లల కార్టూన్ ల పుస్తకాన్ని వెలువరించి "ఫాదర్ ఆఫ్ ఇండియన్ కామిక్ బుక్స్ గా ఆయన పేరుగాంచారు".

ఇక ఆయన సృష్టించిన  క్యారెక్టర్ ‘డుంబు’ అల్లరి అంతా ఇంతా కాదు. తెలుగుతో పాటు తమిళంలో సైతం పాఠకులు వారం వారం ఎదురుచూసేలా చేయడంలో బుజ్జాయి శైలి వేరుగా ఉండేది. ఆయన గీసిన మొదటి క్యారెక్టర్ "బానిస పిల్ల" అయితే పబ్లిషర్స్ ఎవరూ ముందుకు రాకపోవడంతో మరింత ఆలోచించి స్థానికంగా కనిపించే పిల్లల మాదిరిగా ఓ అల్లరి బాలుడు "డుంబు " ని తీర్చిదిద్దారు. ఇంతచేసి ఆయన ఏనాడూ పాఠశాల చదువులు కూడా చదవలేదు. స్కూలుకు వెళ్లకపోయినా తండ్రి, పెద్దల నుంచి జీవితం పాఠాలు నేర్చుకున్న వ్యక్తి సుబ్బరాయశాస్త్రి. కేవలం కళపై ఉన్న అమిత ప్రేమ ఆయన్ను కొత్తబాటలు వేసేలా దారితీసింది.



Photos Credit: హాస్యానందం

నాన్న-నేను పుస్తకంలో ఆయన పంచుకున్న జీవితానుభవాల్లో... తనకు ఐదేళ్ల వయసులో తన తండ్రి దేవులపల్లి కృష్ణశాస్త్రితో కలిసి అంతర్జాతీయ కవి రవీంద్రనాథ్ ఠాగూర్‌ని సామర్లకోటలో పదినిమిషాల పాటు కలిసి ఆశీర్వదాన్ని తీసుకున్న జ్ఞాపకాన్ని రాసుకున్నారు. భారతదేశ మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఆ పదవి పొందడానికి దాదాపు 17 ఏళ్ల ముందు చెన్నై రోడ్డుపయోలో అనుకోకుండా కలిసి, వారి ఇంటికి వెళ్లి తాను కోరగానే పెన్సిల్ స్కెచ్ వేయగా దానిపై ఆయన సంతకం చేసి ఇవ్వడం ఓ మధురానుభూతి అని పేర్కొన్నారు.

1963 నుండి 28 వరకు ఇలస్ట్రేటెడ్ వీక్లీ లో పంచతంత్ర కథలు ఆనాటి బాలలను విశేషంగా ఆకట్టుకునేవి. ఆయన బాలల సాహిత్యానికి చేసిన కృషికి గుర్తింపుగా ఆయన గీసిన పిల్లల పువ్వులు, ఆకాశం బాలల పుస్తకాలకు 1959 నుండి వరుసగా మూడుసార్లు కేంద్ర బాల సాహిత్య అవార్డు వరించింది.
Also Read: Devulapalli Subbaraya Sastri Passes Away: ప్రముఖ కార్టూనిస్టు, రచయిత దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి (బుజ్జాయి) కన్నుమూత

Also Read: Horoscope Today 28 January 2022: ఈ మూడు రాశులవారు అప్రమత్తంగా ఉండాలి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Continues below advertisement
Sponsored Links by Taboola