Komati Reddy Venkat Reddy :  యాదాద్రి పుణ్యక్షేత్ర(Yadadri Temple Reopen) పునః ప్రారంభానికి తనను పిలవకపోవడంపై కాంగ్రెస్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komati Reddy Venkat Reddy) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎంవో ప్రొటోకాల్‌ పాటించలేదని ఆరోపించారు. స్థానిక ఎంపీగా ఉన్న తనకు ఆహ్వానం పంపలేదన్నారు. కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను మాత్రమే ఆహ్వానించారన్నారు. దేవుడి దగ్గర సీఎం కేసీఆర్‌(CM KCR) రాజకీయాలు చేయడం బాధాకరం అన్నారు. 






దేవస్థానం దగ్గర రాజకీయాలు చేయడం దారుణం 


యాదాద్రి పునః ప్రారంభోత్సవానికి స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పిలవకపోవడం నీచపు రాజకీయం అని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, తెలంగాణ రాష్ట్రం(Telangana State) కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అలాంటి వ్యక్తిని ప్రోటోకాల్ పాటించకుండా పిలవకపోవడం దారుణమన్నారు. దేవస్థానం దగ్గర రాజకీయాలు చేయడం దారుణమని విమర్శించారు. సీఎం కేసీఆర్ నీచపు రాజకీయాలకు స్వస్తి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆలేరు ఎంపీపీ గంధమల్ల అశోక్ ఆరోపించారు.  


యాదాద్రి(Yadadri) దర్శన వేళల్లో మార్పులు



  • ఉదయం 3 గంటల నుంచి 3.30 గంటలకు సుప్రభాతం 

  • ఉదయం 3.30 గంటల నుంచి 4 గంటల వరకు బిందె తీర్థం, ఆరాధన

  •  ఉదయం 4 గంటల నుంచి 4.30 గంటల వరకు స్వామివారికి బాలభోగం

  • ఉదయం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిజాభిషేకం

  • ఉదయం 5.30 గంటల నుంచి 5.45 గంటల వరకు అలంకార సేవ

  • ఉదయం 5.45 గంటల నుంచి 6.30 వరకు స్వామి వారికి సహస్రనామార్చన, ఆండాల్ అమ్మవారికి కుంకుమార్చన 

  • ఉదయం 6.30 గంటల నుంచి 8 గంటల వరకు సర్వ దర్శనాలు

  • ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనం

  • ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు సర్వదర్శనాలు

  • మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.45 గంటల వరకు మధ్యాహ్నా రాజభోగం

  • మధ్యాహ్నం 12.45 గంటల నుంచి 4 గంటల వరకు సర్వ దర్శనాలు

  • సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనం

  • సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు సర్వ దర్శనాలు

  • రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటల వరకు తిరువారాధన

  • రాత్రి 7.30 గంటల నుంచి 8.15 గంటల వరకు స్వామివారికి సహస్రనామార్చన, ఆండాల్ అమ్మవారికి కుంకుమార్చన 

  • రాత్రి 8.15 గంటల నుంచి 9.15 గంటల వరకు సర్వదర్శనాలు 

  • రాత్రి 9.15 గంటల నుంచి 9.45 గంటల వరకు రాత్రి నివేదన, ఆరగింపు

  • రాత్రి 9.45 గంటల నుంచి 10 గంటల వరకు శయనోత్సవ దర్శనం, ప్రధానాలయ ద్వార బంధనం

  • ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9.15 గంటల వరకు జరిగే సర్వదర్శన వేళల్లో సువర్ణపుష్పార్చన, వేదాశీర్వచనం

  • ఉదయం 8.30 గంటల నుంచి 10 గంటల వరకు సుదర్శన నారసింహ హోమం

  • ఉదయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకు స్వామివారి నిత్య కల్యాణోత్సం, బ్రహ్మోత్సవం.

  • సాయంత్రం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు స్వామివారి వెండి జోడు సేవోత్సవాలు

  • సాయంత్రం 6.45 గంటల నుంచి 7 గంటల వరకు దర్భారు సేవ

  • ప్రతీ మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల వరకు విష్ణు పుష్కరిణి, ప్రధానాలయంలోని క్షేత్రపాలకుడికి నాగవల్లీ దళార్చనలు

  • ప్రతీ శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవోత్సవం